PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జ‌గ‌న్ కు భారీ ఊర‌ట‌.. బెయిల్ ర‌ద్దు పిటిష‌న్ కొట్టివేత !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి భారీ ఊర‌ట ల‌భించింది. జ‌గ‌న్ , విజ‌య‌సాయి రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాల‌ని వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ రాజు వేసిన పిటిష‌న్ ను సీబీఐ కోర్టు కొట్టివేసింది. బెయిల్ ర‌ద్దుకు సీబీఐ న్యాయస్థానం నిరాక‌రించింది. కేసుకు సంబంధించిన సాక్షుల‌ను ప్రత్యక్షంగా, ప‌రోక్షంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభావితం చేస్తున్నార‌ని, ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాల‌ని ర‌ఘురామ‌కృష్ణరాజు గ‌తంలో పిటిష‌న్ వేశారు. రెండు, మూడు నెల‌ల పాటు ఈ పిటిష‌న్ పై ఇరువైపుల వాద‌న‌లు విన్న సీబీఐ కోర్టు బెయిల్ ర‌ద్దుకు నిరాక‌రించింది. సీబీఐ కోర్టు తీర్పుపై హైకోర్ట్ కు వెళ్లనున్నట్టు ర‌ఘురామ‌కృష్ణరాజు తెలిపారు.

About Author