NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

బిగ్ బ్రేకింగ్.. విశాఖ‌లో ఫైరింగ్.. ఆరుగురు మావోలు హ‌తం

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: విశాఖ జిల్లాలో అల‌జ‌డి రేగింది. పోలీసులు, మావోయిస్టుల‌కు మ‌ధ్య ఎదురు కాల్పుల‌తో విశాఖ అడ‌వి ద‌ద్దరిల్లింది. కొయ్యూరు మండ‌లం మంప పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని తీగ‌ల‌మెట్ట వ‌ద్ద ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఆరుగురు మావోయిస్టులు హ‌త‌మైనట్టు స‌మాచారం. మావోయిస్టుల క‌ద‌లిక‌ల‌తో స‌మాచారం అందుకున్న పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. తెల్లవారుఝామున తీగ‌ల మెట్ట వ‌ద్ద ఎదురు కాల్పులు జ‌రిగాయి. ఎంత మంది చ‌నిపోయారో.. గాయ‌ప‌డ్డారో స్పష్టంగా తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెబుతున్నారు. ద‌ట్టమైన అట‌వీ ప్రాంతం కావ‌డంతో మృత‌దేహాల కోసం గాలిస్తున్నారని కొయ్యూరు సీఐ వెంక‌ట‌ర‌మ‌ణ తెలిపారు.

About Author