NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఎస్సై ఎన్వీ రమణ కు ఘన సన్మానం…

1 min read

– ఎస్సై ఎన్వీ రమణ రాచర్ల కు బదిలీ

– ఎస్సైగా  ప్రజాభిమానాన్ని చురగొన్న వైనం

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు పట్టణంలో గత మూడు  సంవత్సరాలుగా విధులు నిర్వవర్తించి బదిలీపై వెళ్తున్న ఎస్సై ఎన్వీ రమణ ను మంగళవారం నందికొట్కూరు పాత్రికేయులు, కుల సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.. తొలుత వారికి పుష్ప గుచ్చాలను అందజేసి శాలువాలతో సత్కరించారు..అనంతరం స్థానిక పొలీస్ స్టేషన్ నుంచి పటేల్ సెంటర్ వరకు బాణాసంచా కాల్చుతూ పులా వర్షం కురిపించారు.  డప్పులతో ఊరేగించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఎస్సై గా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుండి శాంతి భద్రతల పరిరక్షణలో ఎనలేని సేవాలందించారన్నారు. అన్నీ వర్గాల ప్రజలతో మమేకమై ఫ్రెండ్లి పోలీసింగ్ కు నిర్వచనం తెలిపారని  కొనియాడారు.నందికొట్కూరు ప్రజల ఆదరాభిమానాలు పొందారని అన్నారు.ప్రజల మనిషిగా  విశిష్ట సేవలందించి తనదైన ముద్ర వేసుకున్నారన్నారు. రక్త దాన శిబిరాలు, సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు. ఇప్పటి వరకు నందికొట్కూరు పోలీస్ స్టేషన్ చరిత్రలోనే ఏ ఎస్సై కి దక్కని గౌరవం కేవలం ఒక్క ఎస్సై రమణ కే దక్కిందని కొనియాడారు.కార్యక్రమంలో నందికొట్కూరు పాత్రికేయులు జయరాజు, పగడం గోపి, ఆంజనేయులు, పరమేష్, సుధాకర్, రహామ్మతుల్లా, స్వామన్న, ఉసేనాలం, వాడాల శేషు, ఆనంద్, షైక్ అబ్దుల్లా , ఉమర్, కుల సంఘాల నాయకులు జాన్, నాగసురేష్, జాలంగారి నాగన్న, మాజీ ఎంపీటీసీ నాగరాజు, విద్యార్థి సంఘాల నాయకులు టీడీపీ, వైసీపీ, జనసేన బీజేపీ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

About Author