బండలాగుడు పోటీల్లో మొదటి విజేత పెద్ద కొట్టాల
1 min read– పోటీలను ప్రారంభించిన జడ్పీటీసీ,మున్సిపాలిటీ చైర్మన్
పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి తిరుణాల సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఎద్దులు బండలాగుడు పోటీలను జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణంలో శుక్రవారం ఉదయం పోటీలను మిడుతూరు మండల జడ్పిటిసి సభ్యులు పర్వత యుగంధర్ రెడ్డి మరియు నందికొట్కూరు మున్సిపాలిటీ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు.అదేవిధంగా రథోత్సవ కార్యక్రమం అనంతరం రాత్రి 7 గంటలకు స్టేట్ బ్యాంక్ ఎదురుగా ఉమ్మడి జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను జడ్పిటిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.కబడ్డీ పోటీలు హోరాహోరిగా సాగుతున్నాయి.క్రీడాకారులను పరిచయం చేసుకొని ఆటల పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని మున్సిపాలిటీ చైర్మన్,జెడ్పిటిసి మరియు ఎస్ఐ మారుతి శంకర్ క్రీడాకారులకు సూచించారు.ఆటల పోటీలను తిలకించడానికి ప్రజలు భారీగా తరలివచ్చారు.బండలాగుడు పోటీలలో గెలుపొందిన మొదటి విజేతగా పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన బోరెడ్డి కేశవరెడ్డి-50వేలు,రెండవ విజేతగా ఫల్కం దొడ్డి గ్రామానికి చెందిన కాజా హుస్సేన్ 40వేలు,మూడవ విజేత కానాల గ్రామానికి చెందిన గుండం చెన్నారెడ్డి 30వేలు,4వ విజేత ఎం.రామసుబ్బారెడ్డి-20వేలు టీ.హుసేనాపురం గ్రామం,బేతంచెర్ల మం,5వ విజేత ఇస్కాల గ్రామం నాగార్జున-15వేలు,6వ విజేత కె.బొల్లవరం గ్రామం బి.వెంకటరమణ యాదవ్ 10వేలు,7వ విజేత ప్రకాశం జిల్లా పెద్దారవీడు గ్రామం అల్లు రేవంత్ రెడ్డి 5వేలు రూ.లు యజమానులకు జడ్పిటిసి యుగంధర్ రెడ్డి,మండల కన్వీనర్ లోకేశ్వర రెడ్డి నగదును అందజేశారు.ఈకార్యక్రమంలో మిడుతూరు ఉపసర్పంచ్ మరియు వైసిపి మండల కన్వీనర్ తువ్వా లోకేశ్వర రెడ్డి,తువ్వా రామనాగేశ్వర రెడ్డి,తువ్వా వెంకట నాగిరెడ్డి,రోళ్ళపాడు వెంకటరామిరెడ్డి,సుంకేసుల సత్యం రెడ్డి,రాంభూపాల్ రెడ్డి,చింతలపల్లె మల్లేశ్వర రెడ్డి,కడుమూరు శంకర్ రెడ్డి, కలమందలపాడు మహబూబ్ బాష,దాసి కృష్ణారెడ్డి,ఆర్గనైజర్లు మరియు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.