PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బిగ్ బాస్ 5.. కంటెస్టెంట్లు వీరే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలుగులో అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్ రెండు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో ఐదో సీజన్‌కు రెడీ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించి ఓ చిన్న ప్రోమోను కూడా రిలీజ్ చేసింది ‘స్టార్ మా’. ఈ ప్రోమో వీడియోలో బిగ్‌బాస్ సీజన్ 5 లోగో కొత్తగా ఉంది. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5 లోగో ఫస్ట్ లుక్ అంటూ ఈ 15 సెకెన్ల ప్రోమోను స్టార్ మా ఆదివారం విడుదల చేసింది. త్వరలో సీజన్ 5 ప్రారంభం కాబోతున్నట్లు అధికారికంగా తెలియజేసింది.
న‌వ‌ర‌సాల మేళ‌వింపు :
‘‘ బిగ్‌బాస్ విజువల్ ఐడెంటిటీని ఈ ఆలోచనను ప్రతిబింబించడంతో పాటుగా ఈ గేమ్‌లోని అతి సూక్ష్మ అంశాలను సైతం తెలుసుకునే రీతిలో రూపొందించారు. ఇంట్లోని ప్రతి అతిథి కోసం ఊహించని మలుపులతో కూడిన ప్రపంచాన్ని సృష్టించే రీతిలో ఇది తీర్చిదిద్దబడింది. బిగ్‌బాస్ ఇంటిలోకి ప్రవేశించే పోటీదారులందరూ విజేతగా నిలిచే ప్రయత్నంలో తమను తాము తెలుసుకుంటారు. ఈ ఇంటికి ఒకటే ప్రవేశ, బయటకు పోవు మార్గాలు ఉండటం మాత్రమే కాదు, అనేక భ్రమలు, నటన, నాటకీయత, ప్రేమ, వినోదం, సరదాకు దారితీసే పలు మార్గాలూ ఉన్నాయి. ఎన్నో మెళికలు మరెన్నో మలుపులు ద్వారా ఆకట్టుకునే రీతిలో బిగ్‌బాస్ ఈ సారి వినోదం అందించడానికి సిద్ధమయ్యాడు. బిగ్‌బాస్ తెలుగు సీజన్ 5, ఆశ్చర్యానుభూతులను అందించనుంది.’’ అంటూ నిర్వాహకులు పేర్కొన్నారు.
గ్లామ‌ర్ డోస్ పెర‌గ‌నుంది :
ఇక నాలుగో సీజన్‌లోలాగా కాకుండా ఈ సారి కాస్తా గ్లామర్ డోస్‌ను కూడా పెంచనున్నట్లు తెలుస్తోంది. ఐదో సీజన్ కోసం ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. మరోవైపు బిగ్‌బాస్ సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు ప్రస్తుతం తుది దశకు చేరుకున్నాయని సమాచారం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో బిగ్‌బాస్ ఐదో సీజన్ త్వరలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సీజన్ సెప్టెంబర్ 5వ తేదిన మొదలు పెట్టాలనీ నిర్వాహకులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక బిగ్ బాస్ మొదటి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయగా.. రెండో సీజన్‌ను నేచురల్ స్టార్ నాని హోస్ట్ చేశారు. ఇక మూడు, నాలుగు సీజన్స్‌ను టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సారి సీజ‌న్ 5ను నాగార్జున హోస్ట్ చేయ‌రని, రానా హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని కూడా రీసెంట్‌గా వార్తలు వినిపించాయి. కానీ నాగార్జునే ఈ సీజన్‌ను హోస్ట్ చేసే అవ‌కాశం ఉంద‌ని టాక్‌.
కంటెస్టెంట్లు వీరే :
ఇక ఈ ఐదో సీజన్ కోసం అప్పుడే నిర్వహకులు కంటెస్టెంట్ లిస్ట్‌ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. యాంకర్ రవి, యాంకర్ వర్షిణి, జబర్దస్త్ గెటప్ శ్రీను, రఘు మాస్టర్, సింగర్ మంగ్లీ, న్యూస్ యంకర్ రోజా, నటి సురేఖ వాణి, సీరియల్ యాక్ట్రెస్ నవ్య స్వామి, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్, ప్రేమకావాలి హీరోయిన్ ఈషా చావ్లా, టిక్ టాక్ స్టార్ దుర్గా రావు ఉన్నారని టాక్. త్వర‌లోనే దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు బ‌య‌ట‌కు రానున్నాయి.

About Author