బీహార్ సీఎం రాజీనామా.. హోం మంత్రిగా ప్రతిపక్ష నేత !
1 min readపల్లెవెలుగువెబ్ : బీహార్ పాలిటిక్స్‌లో సంచలనం చోటుచేసుకుంది. నితీశ్ కుమార్ బీహార్ సీఎం పదవికి మంగళవారం రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ ఫగూ చౌహాన్ కలిసి రాజీనామా లేఖను సమర్పించారు. అయితే, ఆర్జేడీతో కలిసి నితీష్ కుమార్ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. కొత్త ప్రభుత్వంలో కూడా సీఎంగా నితీష్ కుమారే ఉండనున్నట్టు సమాచారం. ఆర్జేడీ మద్దతు ఇస్తున్న కారణంగా.. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌కు హోంశాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్టు సమాచారం.