అభివృద్ధిలో ఆదర్శం బిజినవేముల..!
1 min readఅభివృద్ధి పథంలో దూసుకుపోతున్న గ్రామ పంచాయతీ.
గ్రామ అభివృద్దే ద్వేయంగా సర్పంచ్ అహర్నిశలు కృషి.
రూ.3.54 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు.
మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు.. గ్రామాలు అభివృద్ధి చెందితేనే గ్రామ స్వరాజ్యం ..వైసీపీ ప్రభుత్వం గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా నవరత్నాలతో సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తూ దేశానికే ఆదర్శంగా నిలిస్తున్నారు. అదే స్ఫూర్తితో తన బాధ్యతలను నేరవేర్చుతున్నారు బిజినవేముల సర్పంచ్ రవియాదవ్.ఎన్నో ఏళ్ళు పరిష్కారం కానీ సమస్యలను సైతం పరిష్కరించారు. రాబోయే 30 ఏళ్ల కాలంలో కూడా గ్రామస్తులకు ఇబ్బందులు లేకుండా శాశ్వత మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేశారు.ఆయన చేసిన అభివృద్ధికి మెచ్చి నందికొట్కూరు మండల వైసీపీ పార్టీ అధ్యక్ష పదవి రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సహకారంతో లభించింది.
బిజినవేముల అభివృద్ధి పథంలో…
నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామపంచాయతీ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నాయకత్వంలో గ్రామ సర్పంచిగా గ్రామపంచాయతీకి సంబంధించిన నిధులను అభివృద్ధి పనులకు కేటాయిస్తూ మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధిలో గ్రామాన్ని పరుగులు పెట్టిస్తున్నారు గ్రామ సర్పంచ్ రవియాదవ్. తన గ్రామపంచాయతీని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతి పైసాను గ్రామ పంచాయతీకి కేటాయిస్తున్నారు. ప్రభుత్వం నుండి నిధులు ఆలస్యమైనప్పటికీ సొంత డబ్బుతో గ్రామ అభివృద్ధి పనులను చేపడుతున్నారు. గ్రామ పంచాయతీ మునిపెన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది.తనపై నమ్మకం పెట్టుకుని సర్పంచి గా గెలిపించిన గ్రామస్తుల నమ్మకం వమ్ముచేయకుండా గ్రామాన్ని రూ.3.54 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. నంద్యాల జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచేల అహర్నిశలు కృషి చేశారు. మండలం లో వంద శాతం పిల్లలు బడి బాట పై కలెక్టర్ సైతం అభినందించారు. అభివృద్ధిలో జిల్లాలోనే ఆదర్శ గ్రామంగా బిజినవేముల నిలిచిందంటే అది సర్పంచ్ రవియాదవ్ కృషే అని గ్రామస్తులు ,అధికారులు చెబుతున్నారు.
రూ.3.54 కోట్లతో గ్రామాభివృద్ధి..
రూ.3.54కోట్లు నిధులతో గ్రామంలో డ్రైనేజ్, పారిశుధ్య పనులు, సీసీ రోడ్లు, రైతు భరోసా కేంద్రం, హెల్త్ క్లినిక్, మంచినీటి సౌకర్యం వంటి అనేక అభివృద్ధి పనులను చేపట్టారు. రూ.44లక్షలతో సచివాలయం భవన నిర్మాణం, రూ.24లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మించారు.రూ.23 లక్షల వెచ్చించి వైఎస్సార్ ఆరోగ్య కేంద్రం నిర్మించారు. రూ.75లక్షలతో జడ్పీ పాఠశాల ప్రహరీ గోడ నిర్మిస్తున్నారు. దాదాపు పూర్తి కావచ్చింది. జడ్పీ పాఠశాల అభివృద్ధికి రూ.42 లక్షలతో వంటగది నిర్మాణం, అదనపు గదుల నిర్మాణం, విద్యార్థులకు మినీరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు , బాత్ రూమ్స్ ,మరుగుదొడ్లు నిర్మాణం కోసం రూ.42 లక్షలు ఖర్చు చేశారు. రూ.12 లక్షతో ఉర్దూ పాఠశాల అభివృద్ధి చేశారు. ప్రధానమంత్రి జల జీవన్ మిషన్ పథకం పేస్ 1 కింద రూ.38 లక్షలు , పేస్ 2 కింద రూ.18లక్షల తో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం. గ్రామంలో పైపులైన్ ఏర్పాటు ,కుళాయి ఏర్పాటు చేశారు. నాడు నేడు కింద చిన్నబడి ( ఎంపీపీ పాఠశాల) అభివృద్ధి కోసం రూ.18 లక్షలు ,సీసీ రహదారుల నిర్మాణం కోసం రూ.50 లక్షలు , గ్రామంలో రూ.10 లక్షలతో మురుగునీటి కాలువలు,రహదారులు నిర్మించారు. ఎంపీపీ మురళి కృష్ణా రెడ్డి సహకారంతో ఎంపీపీ నిధులను కేటాయించారు.ఇందులో రూ.6లక్షలతో డ్రైనేజీ కాలువలు ,రూ.4లక్షలతో రహదారు పనులు పూర్తి చేశారు.
గ్రామ పంచాయతీ అభివృద్ధికి తనవంతుగా..
రవియాదవ్… సర్పంచి.
ఈ సందర్భంగా సర్పంచ్ రవియాదవ్ మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత గ్రామపంచాయతీలలో సచివాలయాలు ,వాలంటరీ వ్యవస్థ ఏర్పాటు కావడం పరిపాలన విధానం ,ప్రభుత్వ సేవలు ,సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయి అన్నారు. ముఖ్యమంత్రి అయినప్పుడు నుండి రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగావని తెలిపారు.ఏ ప్రభుత్వం చేయని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రజల మన్ననాలు పొందుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రజలు వైసీపీ ప్రభుత్వం చేసే పనులను గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు. నందికొట్కూరు నియోజకవర్గ సమన్వయకర్త రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి నాయకత్వం లో పని చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. మాపై ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయమన్నారు. తనకు అప్పగించిన వైసీపీ పార్టీ మండల అధ్యక్ష పదవికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.భవిష్యత్తులో యువ నాయకులు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ, గ్రామ పంచాయతీ అభివృద్ధికి తనవంతుగా తోడ్పాటు అందిస్తానని పేర్కొన్నారు.