లక్షల్లో బిల్లులు వసూలు.. హీరో నిఖిల్ ఆగ్రహం
1 min readపల్లెవెలుగు వెబ్: వైద్యం పేరుతో మామూలు జబ్బులకు కూడ లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారని.. ఆస్పత్రుల మీద హీరో నిఖిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్జరీ ఏదైనా సరే .. బిల్లులు మాత్రం లక్షలు దాటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎంతో మంది ఆస్పత్రి బిల్లులు చెల్లించానని, ఒక్కో బిల్లు పది లక్షల పైనే ఉంటుందని అన్నారు. బిల్లులు చెల్లించడానికి తాను చేతనైనంత సహాయం చేశానని చెప్పారు. ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాయని, వీటిని నియంత్రించేది ఎవరని ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశారు.