PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘బిందు..తుంపర సేద్యం ’పై.. శిక్షణ

1 min read

– పథకాల అమలుపై ఆర్​బీకే సిబ్బంది అవగాహన కలిగి ఉండాలి
– ఏపీఎంఐపీ పీడీ ఉమాదేవి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లా ఆధ్వర్యంలో 27.04.23 వ తేదీన ఓర్వకల్, కోడుమూరు, సి.బెళగల్ గూడురు మండలాల పరిదిలోని రైతు భరోసా కేంద్ర సిబ్బందికి బిందు (డ్రిప్) మరియు తుంపర సేద్యం (స్పింక్లర్) పథకం అమలుపై ఉధ్యాన భవన్ కర్నూల్ లో ఒక రోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూక్ష్మ నీటి సాగు పథకం పథక సంచాలకులు శ్రీమతి ఉమాదేవీ మరియు జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి వర లక్ష్మి, వ్యవసాయ సహాయ సంచాలకులు శాలి రెడ్డి , పథక సహాయ సంచాలకులు ఎ. రాజ కృష్ణ రెడ్డి పాల్గొనటము జరిగినది. పథక సంచాలకులు ఉమాదేవీ మాట్లాడుతూ, ఈ ఆర్దిక సంవత్సరం 2023-24 గాను 5,000 హెక్టార్ల లక్ష్యమును జిల్లాకు నిర్దేశిచిండము జరిగినదని తెలిపారు. సూక్ష్మ సేద్యం పై క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని జిల్లాలోని నీటి వనరులు కలిగిన ప్రతి రైతు సూక్ష్మ సేద్యం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ పథకం లో బిందు సేద్య, తుంపర సేద్య పరికరములను రాయితీ పై అందించడము జరుగుతున్నదని తెలిపారు.
రాయితీ వివరములు:
డ్రిప్ పరికరములు:
1) 5 ఏకరములలోపు రైతులకు 90% రాయితీ
2) 5 ఏకరములు పైబడి 10 ఏకరములలోపు రైతులకు 70% రాయితీ.
స్ప్రింక్లర్ పరికరములు:
1) 5 ఏకరములలోపు రైతులకు 55% రాయితీ
2) 5 ఏకరములు పైబడి 12 ఏకరములలోపు రైతులకు 45% రాయితీతో అందజేస్తామని తెలిపారు.
సూక్ష్మ సేద్య విదానములో అమర్చిన పరికరములు వాడే విదానముపై, ఫర్టిగేషన్ పద్దతులు మరియు పురుగులు, తెగుల్లా యజమాన్యం పై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. కార్యక్రమములో, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీమతి వర లక్ష్మి గారు మాట్లాడుతూ, జిల్లాకు కేటాయించిన వ్యవసాయ అనుబంద రంగాలకు సంబందించిన పథకములను పూర్తి స్థాయిలో అమలుపరచాలని మరియు రైతు భరోసా కేంద్రాలలో ఆయా గ్రామాలకు సంబందించి ఖరీఫ్ సిజనకు ఆక్షన్ ప్లాన్ ను తయారు చేసుకొని, తదనుగుణంగా పంటలకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరియు ఇన్పుట్స్ నిబందల మేరకు అమలు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు ఉధ్యాన అధికారి శ్రీ మదన్ మోహన్, మండల వ్యయసాయ అధికారి, బెళగల్ శ్రీ మల్లేశ్ కుమార్ గారు, యం. ఐ. డి. సి జయరాం రెడ్డి, యం. ఐ. ఇ. విజయ్ కుమార్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులు మరియు రైతు భరోసా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.

About Author