బయో మైనింగ్ త్వరితగతిన పూర్తి చేయాలి
1 min read
నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు
కర్నూలు, న్యూస్ నేడు: గురువారం గార్గేయపురం డంప్‌యార్డులో ప్రారంభమైన బయో మైనింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక కమిషనర్ యస్.రవీంద్ర బాబు ఆదేశించారు. గురువారం డంప్‌యార్డంలో బయోమైనింగ్ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో బయో మైనింగ్ ద్వారా చెత్త శుద్ది చేసే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. డంప్ యార్డులో నిల్వ ఉన్న దాదాపు 65 వేల మెట్రిక్ టన్నుల వ్యర్ధాలను రానున్న మూడు నెలల్లోపు బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా శుద్దీకరణ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ట్రామెల్ యంత్రాన్ని వినియోగించుకొని చెత్తను నాలుగు పద్ధతుల్లో ప్రాసెసింగ్ చేస్తారని, ప్లాస్టిక్, ఇనుము, గాజు వస్తువులు, రాళ్లురప్పలను వేర్వేరు చేయడం జరుగుతుందన్నారు.కాగా అంతకన్నా ముందు కమిషనర్ ‘సెట్కూర్ కార్యాలయం’ వద్దనున్న “అన్న క్యాంటీన్”ను పరిశీలించారు. మెనూ, టోకెన్ల సంఖ్య, శుభ్రత అంశాలపై ఆరా తీశారు. నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకోరావాలని నిర్వాహకులకు కమిషనర్ సూచించారు. అలాగే కొత్త బస్టాండ్, గుత్తి పెట్రోల్ బంక్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు.కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, డిఈఈ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.