భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: భారత మాజీ ప్రధాని , కవి ,ఉత్తమ పార్లమెంటేరియన్ అజాతశత్రువు భారత రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి జయంతి దేశవ్యాప్తంగా ప్రతి పోలింగ్ బూత్ లలో జరుగుతున్న సందర్భంగా ఈరోజు కోడుమూరు నియోజకవర్గం కర్నూలు రూరల్ మండలం దిన్నె దేవరపాడు గ్రామo విజ్ఞాన పీఠం నందు తల్లిదండ్రులు లేని చిన్న పిల్లల హాస్టల్ లో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి అంజలి ఘటించి పిల్లలకు పండ్లు పంచడమైనది . అటల్ బిహారీ వాజ్పేయి గురించి కోడుమూరు నియోజకవర్గ కన్వీనర్ మీసాల ప్రేమ్ కుమార్ గారు మాట్లాడుతూ 1924 డిశంబర్ 25 జన్మించిన ఆయన ఆజన్మ బ్రహ్మచారి తనజీవితాన్ని దేశానికి అంకితమిచ్చిన స్వాతంత్ర్య సమరయోదుడు ,మహా వక్త , కవి ఉన్నతవిద్యావంతులు. భారతీయ జనతా పార్టీ స్థాపించి ,అధికారo లోనికి తీసుకు రావడానికి ఆయన కృషి అనిర్వచనీయo. మూడుమార్లు భారత ప్రధానిగా సుపరిపాలన అందించినందుకు ఆయన జన్మదినాన్ని ‘సుపరిపాలన దినోత్సవo’ గా భారత ప్రభుత్వo ప్రకటించినది. జాతీయ రహదారుల అభివృద్ది, గ్రామ్ సడక్ యోజన ద్వార ప్రతిపల్లెకు రోడ్లు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా నిరుపేదలకు ఇళ్లు , దేశ అభివృద్ది , అంతర్జాతీయ సంబందాలు , పోక్రాన్ అనుపరీక్షలు , ఆపరేషన్ విజయ్ కార్గిల్ యుద్దవిజయo , ‘ అంత్యోదయ – చిట్టచివరి నిరుపేదకు ప్రభుత్వ పతకాలు అందాలన్న గట్టి సంకల్పo ‘వంటి అనేక నిర్ణయాల ద్వారా ‘ప్రకాసిత్ భారత్ – భారత్ వెలుగుతోంది’ ను నిర్మించారు ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ తన తొమ్మిది సంవత్సరాల సుపరిపాలనలో ‘ వికసిత్ భారత్ ‘ చేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి గీతామాధురి గారు కోడుమూరు నియోజకవర్గం మాజీ కన్వీనర్ సద్దల మధు కిషోర్ ,జిల్లా కార్యవర్గ సభ్యులు సుధాకర్ రెడ్డి నాయకులు విశ్వనాథ్,మధు,నరేష్,సీనియర్ అద్యాపకులు రణధీర్ రెడ్డి హాస్టల్ వార్డెన్ రాజశేఖర్ పాల్గొన్నారు.