NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఘనంగా శ్రీధర్ రాజు జన్మదిన వేడుకలు..

1 min read

– విచ్చేసిన సంఘా నాయకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రేయోభిలాషులు..

– సంఘ నాయకునిగా మరింత ఎదగాలని పలువురు ఆకాంక్ష..

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు గున్నూరి శ్రీధర్ రాజు జన్మదిన వేడుక శుక్రవారం  స్థానిక ఏలూరులోని జిల్లా పరిషత్ ఆవరణ తమ సంఘ  కార్యాలయంలో యూనియన్ నాయకులు ఉద్యోగ సంఘాల సభ్యులు. మిత్రులు శ్రేయోభిలాషులు సమక్షం లో పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా శ్రీధర్ రాజు జన్మదిన వేడుకలు  ఘనంగా జరిగాయి. యూనియన్ లీడర్.  జిల్లా అధ్యక్ష పదవిని మచ్చలేని నాయకునిగా అత్యంత సమర్ధ నియంగా నిర్వహిస్తున్నరు.  యూనియన్ కి సంఘ పరంగా ఎన్నో సేవలు అందిస్తున్నారు. విధి నిర్వహణలో ఒక బాధ్యత గల ఉద్యోగిగా వ్యవహరిస్తూ ఉంటారని విచ్చేసిన  తోటి ఉద్యోగులు వక్తలు కొనియాడారు. ఉద్యోగుల సమస్యల సాధనకై అలుపెరగని పోరాటం చేసే ఒక గొప్ప నాయకునిగా అభివర్ణించారు. శ్రీధర్ రాజు  భవిష్యత్ లో  ఉన్నతంగా  ఎదగాలని కోరుకుంటున్నట్లు, ఆ దేవుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని చరవాణిల ద్వారా మరియు స్వయంగా విచ్చేసి బహుమతులు అందజేసి  పుష్పగుచ్చాలు అందించి శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నేరుసు వెంకట రామారావు, మరియు ఆర్ఎస్ హరినాథ్, జిల్లా ట్రెజరీ అధ్యక్షులు కప్పల సత్యనారాయణ, ఏపీ ఎన్జీవో స్ సంఘ మహిళ ఉద్యోగులు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

About Author