PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు..

1 min read

పల్లెవెలుగు వెబ్ ఆస్పరి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను గురువారం మండల కేంద్రమైన ఆస్పరిలో ఆలూరు టిడిపి ఇన్చార్జ్ కోట్ల సుజాతమ్మ ఆదేశాల మేరకు టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. స్థానిక గాంధీ పార్క్ ఆవరణలో టీడీపీ యువ నాయకులు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఈ సందర్భంగా టీడీపీ మాజీ మండల కన్వీనర్ తిమ్మన్న,సతీష్ కుమార్, టీడీపీ గ్రామ కమిటి అధ్యక్షులు వీరేష్,మాట్లాడుతూ నవ్యాంధ్ర ప్రదేశ్ రూపశిల్పి, ఆంధ్రుల గుండె చప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి జన్మదిన ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈశ్వర్, ఆంజనేయ,తయన్న,గిరి, శేఖర్,మహేష్ , అంజి, సంజీవ, శంకర్, మహానంది తదితరులు పాల్గొన్నారు.

About Author