PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా మాల మహాసేన జాతీయ అధ్యక్షుడి జన్మదిన వేడుకలు

1 min read

– శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు ప్రముఖులు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఉభయ రాష్ట్రాల తెలుగు దినపత్రిక ఎడిటర్ మరియు మాల మహాసేన జాతీయ అధ్యక్షులు అలగ రవి కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా లేడీస్ క్లబ్ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో దళిత నాయకులు అభిమానులు కార్యకర్తలు పాల్గొని అట్టాసంగా జై భీమ్, జై భీమ్ నినాదాలతో ప్రారంభించి నిర్వహించారు, ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, సందర్భంగా జిల్లాలో 13 నియోజకవర్గాలలో ఆయన అభిమానులు స్నేహితులు. బంధుమిత్రులు వారి జన్మదిన సందర్భంగా అభిమానాన్ని పెద్ద ఎత్తున పలువురు ప్రముఖులతో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు స్థానిక ప్రాంగణంలో పాల్గొని భారీ జన్మదిన కేక్ కట్ చేసి సంతోషాన్ని పాలుపంచుకున్నారు, సాధారణంగా ఒక వ్యక్తికి అభిమానులు ఒక స్థాయిలో ఉంటారు. కాని అలుపెరుగని నిరంతర ప్రజా సమస్యలపై పోరాడే ఒక జర్నలిస్టు గా దళిత నాయకుడిగా,తన వద్దకు వచ్చే సాధారణ పౌరులు కూడా తనవంతు సలహాలు సూచనలు సహాయం అందించడంలో అలగ రవి ముందంజలో ఉంటారనడంలో అతిశయోక్తి లేదు. జన్మదిన సందర్భంగా వస్త్రదానం, అన్నదానం తన కుటుంబంలో ఉద్యోగలతో ఉన్నత విద్యాభ్యాసం గలవారైనా తన పయనం అన్యాయాలకు, అక్రమాలకు గురైన బడుగు బలహీన వర్గాల కోసమే నేను సైతం అంటూ ముందడుగు వేస్తాడు, అలగ రవి వర్ణలెరుగని ఇంద్రధనస్సుల కులమతాలకు అతీతంగా భాషా ప్రాంత విభేదాలకు తావులేకుండా తన మృదు స్వభావంతో సున్నిత మనస్తత్వంతో అందర్నీ ఆలింగనం చేసుకోవడం ఎల్లలు దాటిన తనకె తెలియని తన నైజం, సమయపాలన క్రమశిక్షణ. పట్టుదల కృషితో ఓర్పు సహనంతో విజయ పరంపర దిశగా పని చేయడం ఆయన జన చర్యలో ఒక భాగం, ఆయనో సైనికుడు. గతించిన కాలం కన్నా జరుగుతున్న సమయంతో రాబోయే రోజుల్లో ఎన్నో న్యాయపోరాటాల్లో విజయం చేకూర్చాలని మాల మహాసేన దళిత గర్జన (ప్రిపరేషన్ వర్క్ మీటింగ్) విజయవంతం కావాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షించారు, మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ మనస్పూర్తిగా కోరుకుంటున్నారు. కార్యక్రమంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ లు మరియు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా దళిత జేఏసీ చైర్మన్ సంజీవ్ చాగంటి, ఉప్పులేటి దేవి ప్రసాద్, అమరావతి జేఏసీ అధ్యక్షులు మరియు సీనియర్ జర్నలిస్టు పోతుల బాలకోటయ్య కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్, రాష్ట్ర సీనియర్ దళిత నాయకులు ఫిరంగుల బాల, మాల మహాసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాపు దాసి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరిక పాటి విజయ్, మాల మహా సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి శంకర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల మరియు ఉమ్మడి జిల్లాల నాయకులు పొలిమేర హరికృష్ణ, తోటకూర కిషోర్, టిడిపి నాయకులు నేతల రవి, పులవర్తి కొండబాబు, జర్నలిస్ట్ సంఘాల నాయకులు, జర్నలిస్టులు, ఫోటో జర్నలిస్టులు పాల్గొని రవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు, నంతరం జై భీమ్. జై భీమ్ అంటూ నిదానదాలతో ముగించారు.

About Author