NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేయర్​ ఆధ్వర్యంలో.. ఎమ్మెల్యే తనయుడి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు  వెబ్​, గడివేముల:పాణ్యం ఎమ్యెల్యే, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కాటసాని  రాంభూపాల్ రెడ్డి  తనయుడు వైఎస్ఆర్సిపి యువ నాయకుడు కాటసాని శివ నరసింహ రెడ్డి  జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  మండల కేంద్రంలోని జడ్పిటిసి సభ్యులు ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి స్వగృహంలో కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ఆధ్వర్యంలో  జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అభిమానులు, నాయకుల సమక్షంలో  కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కర్నూల్ నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ యువనేత కాటసాని శివ నరసింహారెడ్డి తండ్రికి తగ్గ తనయుడని, తండ్రి బాటలో నడిచి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల మన్నన పొందుతున్నారని భవిష్యత్తులో యువ నాయకుడుగా రాజకీయాలలో తనదైన శైలిలో రాణించాలని అభిలాషించారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి చిందుకూరు వెంకట కృష్ణారెడ్డి ఉప సర్పంచ్ బాలచన్నీ దుర్వేసి వైసిపి నాయకులు బండపల్లి రమేష్. పోతిరెడ్డి పరమేశ్వర్ రెడ్డి. సొసైటీ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి. పాపారాయుడు .ఆర్ ఐ సంజీవరెడ్డి. శేషాద్రి గౌడ్. తదితరులు పాల్గొన్నారు.

About Author