PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎన్​కేఆర్​​ బర్త్‌ డే స్పెషల్‌

1 min read

సినిమా డెస్క్: నేడు నందమూరి కళ్యాణ్‌రామ్‌ పుట్టినరోజు. పలువురు హీరో హీరోయిన్ల, దర్శకనిర్మాతల అభినందనల ట్వీట్స్‌తో కళ్యాణ్ రామ్‌ ట్విట్టర్‌‌ నిండిపోయింది. కేవలం శుభాకాంక్షలే కాదు టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో దిల్‌రాజు, శిరీశ్‌ నిర్మాతలుగా ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘118’ ఫేమ్‌ కె.వి.గుహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుంది. మరో డిఫరెంట్‌ రోల్‌లో కళ్యాణ్‌రామ్‌ను చూపించడానికి గుహన్‌ సరికొత్త కథతో స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. కళ్యాణ్‌రామ్‌ 20వ చిత్రమిది. త్వరలోనే ప్రారంభం కాబోయే ఈ సినిమాలోని ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు గురించి త్వరలోనే తెలియజేస్తామన్నారు.

ఇంతలో కళ్యాణ్‌కి బర్త్‌ డే కానుకగా ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్‌లో కళ్యాణ్ రామ్‌ 22వ చిత్రం ఉంటుందని ప్రకటిస్తే, అభిషేక్‌ వారి పిక్చర్స్‌లో కొత్త డైరెక్టర్‌‌తో కళ్యాణ్ 21వ సినిమా ఉంటుందని ప్రకటించింది. ఆల్రెడీ మైత్రీ మూవీ మేకర్స్‌ ఫిబ్రవరిలో ప్రకటించిన కళ్యాణ్ 19వ చిత్ర షూటింగ్‌ త్వరలోనే ఉంటుందని నేడు క్లారిటీ ఇచ్చింది. డెబ్యూ డెరెక్టర్‌‌ రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. కాగా ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సోషియో ఫాంటసీ మూవీగా తెరకెక్కుతున్న ‘బింబిసార’ షూటింగ్‌తో బిజీగా ఉన్న నేడు వరుస చిత్రాల ప్రకటనతో ఫ్యాన్స్‌ను ఉక్కిరి బిక్కిరి చేశాడు.

About Author