PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘ బిస్కెట్ కింగ్’ బ‌యోపిక్ !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ వ్యాపారవేత్త రాజ‌న్ పిళ్లై జీవిత చ‌రిత్ర ఆధారంగా బ‌యోపిక్ తెర‌కెక్కబోతోంది. బాలీవుడ్ లో వెబ్ సిరీస్ నిర్మించేందుకు స‌న్నాహాలు సాగుతున్నాయి. ప్రముఖ మ‌ళ‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ బిస్కెట్ కింగ్ పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌నే ద‌ర్శక‌త్వంవ‌హిస్తున్నారు. రాజ‌న్ పిళ్లై బ్రిటానియా ఇండస్ట్రీలో వాటాదారుడు. 1970 కాలంలో సింగ‌పూర్ కేంద్రంగా వ్యాపారాలు నిర్వహించి బిస్కెట్ కింగ్ గా పేరు ప్రఖ్యాత‌లు సంపాదించారు. 1993లో సింగ‌పూర్ వాణిజ్య శాఖ ఆయ‌న పై ప‌లు ఆరోప‌ణ‌ల‌తో విచార‌ణ చేప‌ట్టింది. 1995లో జులై 4న న్యూఢిల్లీలో ఓ హోట‌ల్ ఆయ‌న‌ను అరెస్టు చేశారు. అనంత‌రం తీహార్ జైలుకు త‌ర‌లించారు. అనారోగ్యంతో క‌స్టడీలోనే రాజ‌న్ పిళ్లై మ‌ర‌ణించ‌డం అప్పట్లో సంచ‌ల‌నంగా మారింది. కె. గోవింద్ కుట్టితో క‌లిసి రాజ‌న్ సోద‌రుడు రామ్మోహ‌న్ పిళ్లై  ` ఏ వేస్టెడ్ డెత్ : ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రాజ‌న్ పిళ్లై` పేరుతో పుస్తకం రాశారు. ఈ పుస్తకం ఆధారంగా వెబ్ సిరీస్ తెర‌కెక్కనుంది.

About Author