ఘనంగా బిషప్ జయరావు పొలిమేర జన్మదిన వేడుకలు..
1 min read– సేవే మార్గంగా, ప్రేమే లక్ష్యంగా నిలిచే ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి..
– వైఎస్ఆర్ పార్టీ నాయకులు హరికృష్ణ పొలిమేర
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : ఏలూరు కతోలిక పీఠాధిపతులు డాక్టర్ జయరావు పొలిమేర బిషప్ జన్మదిన వేడుకల స్థానిక గన్ బజార్ సెంటర్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం ఆయన ప్రేమించే వృద్ధులు, వితంతువులు, అన్నీ వర్గాల పేద ప్రజల మధ్య జరగడం, జరుపు కోవడం ఆనందదాయకమని, తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల పెంపు సాధన సమితి జాతీయ కన్వీనర్, జాతీయ సీనియర్ ఎస్సీ నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ పొలిమేర హరికృష్ణ అన్నారు. స్థానిక 44 డివిజన్ గన్ బజార్లో అక్షర సొసైటీ, సిటీ న్యూ క్రిస్టియన్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో బిషప్ జయరావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ముఖ్య అతిథిగా పాల్గొన్న హరికృష్ణ మాట్లాడుతూ క్రైస్తవ సమాజంతోపాటు, అన్ని వర్గాల పేదలను సైతం అక్కున చేర్చుకొనే గొప్ప రాజనీతిజ్ఞుడు బహుభాషా కోవిదులు బిషప్ జయరావు అని క్రైస్తవ యువతరం వారంతా దైవ మార్గంలో, సేవా మార్గంలో ప్రేమే లక్ష్యంగా ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు వరదలు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బిషప్ జయ రావు ఆదేశాలు మేరకు ఆయా బాధితులకు ఆర్ సి ఎం సంస్థల నుండి అన్ని విధాల సత్వర సేవలలు అందించడం ఆయన సేవకు నిదర్శనం మన్నారు. అదేవిధంగా విద్యా వైద్య కి కూడా తన వంతు సహాయం అందిస్తుంటారని హరికృష్ణ అన్నారు.బిషప్ జయరావ్ జన్మదిన వేడుకలు పేద ప్రజల జన్మదిన వేడుకగా వారి మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బర్త్డే కేక్ ని కట్ చేసి బిషప్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం వృద్ధులకు, వితంతువులకు వస్త్ర దానం చేశారు .ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ యూత్ నాయకులు, అక్షర సొసైటీ నాయకులు బేవనపల్లి లక్ష్మణ్, గూడవల్లి శ్రీనివాస్, మందపాటి నవీన్, పొలిమేర వరుణ్, చోదిమెళ్ళ నాగు , జిల్లా రెల్లి సంగం నాయకులు బంగారు రజనీకుమార్, సుధాకర్, గణేష్ కుమార్ ,ఎల్లయ్య, వెంకీ తదితరులు పాల్గొన్నారు.