10న నందికొట్కూర్ కు..కడప బిషప్ రాక
1 min read
వేళాంగణి మాత మహోత్సవాలకు తరలిరండి
ప్రత్యేక అలంకరణగా రూపు దిద్దుకుంటున్న దేవాలయం
విచారణ గురువు కేడీ జోసఫ్..
నందికొట్కూరు, న్యూస్ నేడు: ఈనెల పదవ తేదీన నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కర్నూలు రహదారిలో ఉన్న వేళాంగణి మాత మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా కడప నూతన బిషప్ మహాఘన శ్రీశ్రీశ్రీ డాక్టర్ సగినాల పాల్ ప్రకాష్ గారు హాజరవుతున్నారని నందికొట్కూరు ఆర్ సీఎం విచారణ గురువులు కేడీ జోసెఫ్ అన్నారు.ఈనెల 8,9, 10 వ తేదీలలో మహోత్సవాలు జరుగుతాయని చివరి రోజు 10వ తేదీన సా 6 గంటలకు కడప బిషప్ పట్టణంలో ఊరేగింపు అనంతరం దేవాలయ ప్రాంగణంలో బిషప్ దివ్యబలి పూజను సమర్పిస్తారని అన్నారు.ఎంతో దూరప్రాంతాల నుంచి మరియ తల్లి విశ్వాసులు అధిక సంఖ్యలో కుటుంబ సమేతంగా హాజరై ప్రత్యేకంగా పూజల్లో పాల్గొనాలని అన్నారు.వేళాంగణి మాత దేవాలయాన్ని ప్రత్యేక అలంకరణగా చేస్తున్నారు. ప్రజలు ప్రతి ఏడాదిన జరిగే మహోత్సవాలకు అధిక సంఖ్యలో వస్తున్న తరుణంలో వారిని దృష్టిలో ఉంచుకొని భక్తులకు తగిన రీతిలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విచారణ గురువు ఫాదర్ కేడీ జోసఫ్ మరియు జూపాడుబంగ్లా విచారణ గురువులు ఎల్.బాలయేసు ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి.ఈ మహోత్సవాలకు కుటుంబ సమేతంగా వచ్చి దేవుని ఆశీస్సులు పొందాలని వారు పత్రికా ముఖంగా కోరారు.