PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయలసీమ ద్రోహులుగా బిజెపి… జగన్ ప్రభుత్వాలు       

1 min read

పల్లెవెలుగు వెబ్ పత్తికొండ:  కృష్ణా నీటి వివాదాలపై ఏపీ తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం చేస్తూ కేంద్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ఎన్నికల లబ్ధి కోసమేనని, మంత్రివర్గ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే బిజెపి ప్రభుత్వం జగన్ ప్రభుత్వం రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని సిపిఐ మండల కార్యదర్శిడి.రాజా సాహెబ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కృష్ణా జలాల పునః పంపిణీ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ, మంగళవారం పత్తికొండ రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్డిఓ మోహన్ దాస్ కు  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.అనంతరం సిపిఐ మండల కార్యదర్శి డి రాజా సాహెబ్ మాట్లాడుతూ, కృష్ణ నీటి వివాదాలపై ఏర్పాటైన  బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం కేటాయింపులను యధావిధిగా అమలు  చేయాలని కోరారు. అలాగే మిగులు జలాలను కూడా లెక్క గట్టి నాలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు పర్యావసానంగా మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న హంద్రీనీవా గాలేరు నగరి వెలుగొండ తెలుగు గంగ ప్రాజెక్టుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారనున్నదని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు  పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిందన్నారు. ఒకవైపు కేసు విచారణలో ఉండగానే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని అడ్డగోలు నిర్ణయాలు చేసి అందలమెక్కాలని చూస్తుందని అన్నారు.కర్ణాటక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎగువ భద్ర ఎత్తిపోతల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి,2023-24 బడ్జెట్లో నిధులు కేటాయించి లబ్ధి పొందాలని చూసిందని విమర్శించారు. కర్ణాటక ప్రజలు బిజెపి సంకుచిత రాజకీయాలను ఓటు ద్వారా తగిన బుద్ధి చెప్పారని తెలిపారు. త్వరలో తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ లబ్ధి కోసం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కృష్ణ నీటి వివాదాలపై రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేస్తూ, మళ్లీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కట్టబెడుతూ చేసిన తీర్మానం ఆంధ్రప్రదేశ్ కు అందులో రాయలసీమకు తీవ్ర అన్యాయం జరగనున్నదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బచావత ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టిఎంసిలు కేటాయించగా అందులో విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయింపులను ప్రస్తుతం అమలులో ఉండగా తెలంగాణ ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేటాయించిన మొత్తం నీటిలో సగం వాటా తనకు కావాలంటూ వితండ వాదం చేస్తోంది అని అన్నారు. మరోవైపు కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు బచావత్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులు ప్రకారం తాము ముందుగానే వినియోగించుకునేందుకు అవసరమైన ప్రాజెక్టుల ఎత్తు, నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతి ఇవ్వాలని వాదిస్తున్నాయి. బ్రిజేష్  కుమార్ తీర్పు అమలు అయితే రాయలసీమ శాశ్వత ఎడారిగా మారుతుందని, తీర్పుపై సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిందన్నారు. నీటి వివాదాలపై ట్రిబ్యునల్ తుది తీర్పు సుప్రీంకోర్టులో విచారణలో ఉండగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వెల్లడించాలని కోర్టు అడుగగా బిజెపి ప్రభుత్వం బ్రిజస్ కుమార్ తీర్పు యధావిధిగా అమలు చేయాలని అఫిడవిట్ దాఖలు చేయడం విచారకరమన్నారు. నాలుగు రాష్ట్రాల మధ్య ఉన్న నీటి సమస్యను రెండు రాష్ట్రాలకే పరిమితం చేసి, సగం వాటా కావాలన్న తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ ను కేంద్రంలో బిజెపి రెండు రాష్ట్రాలకే పరిమితం చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు కేటాయించడం రాజకీయ ప్రయోజనాలు తప్ప న్యాయపరంగా చెల్లుబాటు కాదన్నారు. కేంద్రంలో బిజెపి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు పరిశ్రమ, జాతీయ హోదా కలిగిన పోలవరానికి నిధుల కేటాయింపు వంటి విషయాలనే పూర్తిగా పక్కకు పెట్టి, రాష్ట్రానికి రాయలసీమకు వ్యతిరేకమైన చర్యలకు పూనుకుంటుంటే బిజెపి తీసుకునే ప్రతి చర్యలో భాగస్వామ్యం అవుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందరే అన్యాయం జరుగుతుంటే కల్లప్పగించి చోద్యం చూస్తున్నారని అన్నారు. అనుమతి లేని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభించిన పల్లెతు మాట మాట్లాడడం లేదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పై ఎన్జీటీ కి ఫిర్యాదు చేసి పనులు ఆపించినా జగన్ లో మార్పు రాకపోవడం విచారకరమని వాపోయారు. జగన్కు రాష్ట్ర ప్రాంత ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాయలసీమకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం పొంచి ఉన్నదన్నారు. రాష్ట్ర రాయలసీమ నీటి హక్కులు కాపాడు లేకపోతే రాయలసీమ ద్రోహిగా జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు ఆర్ . గురుదాస్ ఎం కారన్న ఎఐటియుసి నియోజకవర్గ  అధ్యక్షులు నెట్టికంటయ్య  ఎఐటియుసి తాలూకా గౌరవ అధ్యక్షులు మాదన్న   ఏ ఐ వై ఎఫ్ పత్తికొండ పట్టణ కార్యదర్శి విజయ్ సిపిఐ శాఖ కార్యదర్శి జోలాపురం కాశి సిపిఐ నాయకులు నాగరాజు పులిశేఖర్ రవి తదితరులు పాల్గొన్నారు.

About Author