PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేంద్రంలో బిజెపి రాష్ట్రంలో వైకాపా  ఇకనైనా కళ్ళు తెరవాలి

1 min read

400 పైగా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

దేశానికి వెన్నెముఖ రైతే

రైతే రాజు, రారాజు

రాజు తలచుకుంటే రాజ్యాలే కూలతాయ్

బిజెపి,వైకాపాలకు కాలం చెల్లింది,రానున్నది కాంగ్రెస్ రాజ్యం

రాజు వంటి రైతు కన్నెర్ర చేస్తే బిజెపి వైకాపా పాలకుల పతనం తప్పదు

చలో కర్నూల్ కలక్టరేట్ అని కాంగ్రెస్ పిలుపునిస్తే వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనం

రైతు ఉద్యమంతో కేంద్రం లోని బీజీపీ రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వాలకు కౌంట్ డౌన్ మొదలైంది

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి,కార్పొరేట్ కబంధ హస్తాలనుండి దేశం రక్షింపబడాలి

పల్లెవెలుగు వెబ్  హొళగుంద  : ఛలో కర్నూల్ కలక్టరేట్ రైతు ధర్నాలో పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు,CWC సభ్యులు ఎన్.రఘువీరారెడ్డి ధ్వజంరైతాంగ ప్రయోజనాలకు విఘాతం కలిగించే వ్యవహారాలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఉపసంహరించుకోవాలని 400 పైగా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో గిడుగు రుద్రరాజు గారు పిలుపునిచ్చిన చలో కర్నూల్ కలెక్టరేట్ కార్యక్రమం జరిగింది.మోదీ,జగన్ లు కళ్ళు తెరవాలని హెచ్చరించారు.దేశానికి వెన్నెముఖ రైతేనని, రైతే రాజు, రారాజని, రైతులేనిదే రాజ్యం లేదని, అటువంటి రాజును రోడ్డున పడేసి కార్పొరేట్లకు ఈ ప్రభుత్వాలు కొమ్ము కాస్తున్నాయని మండిపడ్డారు.రైతుల దెబ్బకు ఏ ప్రభుత్వాలు నిలబడలేదని గిడుగు రుద్రరాజుగుర్తు చేశారు రైతులకు భరోసా కల్పించాల్సింది పోయి వారి శ్రమను, ప్రయోజనాలను కార్పోరేట్ సంస్థలకు ధారాదత్తం చేయాలనుకుంటే రైతుల నుండి పతనం తప్పదని ఎన్. రఘువీరారెడ్డి  హెచ్చరించారు.రైతు రోడ్డెక్కితే మోడీ,జగన్లకు చీమ కుట్టినట్లు కూడా లేదని,కాంగ్రెస్ పక్షాన  తామెప్పుడూ రైతుపక్షమేనని కరువు మండలాలను ప్రకటించేవరకు ఈ ఉద్యమం ఆగదని,కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కౌంట్ డౌన్ మొదలయ్యిందని హెచ్చరించారు.రైతు గర్జన చలో కలెక్టర్ కార్యక్రమానికి కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి అమానుల్లా మరియు ఆలూరు నియోజకవర్గం రైతులు పాల్గొడం జరిగింది.

About Author