తమిళనాడులో బీజేపీ బోణీ !
1 min readపల్లెవెలుగువెబ్ : తమిళనాడు అర్బన్ ఎన్నికల్లో అధికార డీఎంకే అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మేజర్ స్థానాల్ని కైవసం చేసుకుని.. ఎన్నికల ట్రెండ్స్‌లో స్పష్టమైన ఆధిప్యతంతో ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మునుపెన్నడూ లేని చెన్నై వేదికగా సరికొత్త రాజకీయం తెరపైకి వచ్చింది. చాలా చోట్ల అన్నాడీఎంకేను వెనక్కి రాజేసి.. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని కొన్ని వార్డుల్లో.. అన్నాడీఎంకే మూడో స్థానానికి పరిమితమైంది. అది కూడ బీజేపీ కంటే చాలా ఓట్ల తేడాతో వెనుకబడడం విశేషం. తాజా ట్రెండ్ ప్రకారం.. చెన్నైలో కనీసం ఐదు వార్డులనైనా బీజేపీ సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది.