NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్​ వేసిన ఘనత బీజేపీదే: టీజీ వెంకటేష్​

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: ప్రజల సంక్షేమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ పని చేస్తోందన్నారు రాజ్య సభ సభ్యలు టీజ వెంకటేష్​. ప్రధాని నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా కర్నూలు నగరంలో 20 రోజులపాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఆదివారం నగరంలోని కేశవమెమోరియల్​ స్కూల్​లో ఉచిత వైద్యశిబిరాన్ని ఎంపీ టీజీ వెంకటేష్​ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉచిత వైద్యపరీక్షలు చేసి.. అవసరమైన మేరకు మందులు పంపిణీ చేశారు. అనంతరం ఎంపీ టీజీ వెంకటేష్​ మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో దేశంలో వంద కోట్ల మందికి వ్యాక్సినేషన్​ వేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. ప్రపంచం లో ఎక్కడా కూడా ఇంత మందికి వ్యాక్సిన్ వేసినటువంటి దాఖలాలు లేవు.. ప్రజలు కరోనా భారిన పడకుండా సత్వర చర్యలు తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం సఫలమైంది.. కేంద్ర ప్రభుత్వం ఒక వైపు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ప్రాధాన్యతనిస్తూనే, అగ్ర కులాలలో ఉన్నటువంటి నిరుపేదలకు కూడా ఎంతో చేయూతనిస్తుంది. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కపిలేశ్వరయ్య, రామస్వామి, నరసింహ వర్మ, డాక్టర్ వినీషా రెడ్డి, డాక్టర్ వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

About Author