ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న బీజేపీ
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: పార్లమెంటులో అధికార బిజెపి విపక్ష పార్టీలపై నియంతృత్వ పోకడలను అవలంబిస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని కాంగ్రెస్ పార్టీ పత్తికొండ నియోజకవర్గ ఇన్చార్జి క్రాంతి నాయుడుఅన్నారు. ప్రస్తుతం జరుగుతున్న శీతాకాల పార్లమెంటు సమావేశంలో 146 మంది విపక్ష పార్టీీల ఎంపీలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేయడాన్ని నిరసిస్తూ, స్థానిక నాలుగు స్థంబాల కూడలిలో పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా క్రాంతి నాయుడు మాట్లాడుతూ, పార్లిమెంట్ లో ఆరుగురు చొరబడితే బాధ్యత వహించకుండా హోమ్ మంత్రి అమిత్ షా, డిఫెన్స్ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మరియు ప్రధాన మంత్రి మోడీ కనీసం చేపట్టిన చర్యల మీద వివరణ ఇవ్వకుండా 146 మంది ఎంపీలను 76 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశంలో ఎన్నడూ లేని విధంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన మూడు ముఖ్యమైన న్యాయ చట్టాలను ఎటువంటి చర్చలు లేకుండా ఆమోదించడం ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అన్నారు. 2 కోట్ల ఉద్యగాలు ప్రతి యేటా ఇస్తాం అని గద్దెనెక్కిన మోడీ నియంతృత్వ ధోరణితో నిరుద్యోగం, అధిక ధరలను పట్టించుకోని కారణంగా మేము పార్లమెంటులో నిరసన తెలపడానికే పార్లమెంటులోకి చొరబడ్డామని చెప్పడం మోడీ విఫల పాలనకు అద్దం పడుతుందన్నారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి రాహుల్ గాంధీ మరియు ఇండియా కూటమి మీద బురద జల్లుతూ, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. ప్రజలు అవేవీ నమ్మడానికి సిద్ధంగా లేరని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాగార్జున, సోమశేఖర గౌడ్, శ్రీకాంత్, షబ్బీర్, ఇలియాస్, సదా, రహ్మాన్ తదితరులు పాల్గొన్నారు.