NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ముస్లిం మైనార్టీలపై మతద్వేషాన్ని చిమ్ముతున్న బిజెపి

1 min read

వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలి ఇన్సాఫ్

ఎమ్మిగనూరు, న్యూస్​ నేడు:   పట్టణంలో మైనారిటీల పై బిజెపి ప్రభుత్వం మత ద్వేషాన్ని చిమ్ముతూ మతకలహాలు సృష్టిస్తుందని, కేంద్రా ప్రభుత్వం బుధవారం రోజున లోక్ సభ లో  ప్రవేశపెడుతున్న వక్ఫ్ బోర్డ్ సవరణ బిల్లు ఉపసంహరించుకోవాలని ఇన్సాఫ్ పట్టణ అధ్యక్షుడు కెసి జబ్బర్, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు అజార్, సమీవుల్లా తెలిపారు.అనంతరం సిపిఐ కార్యాలయంలో ఇన్సాఫ్ పట్టణ సమితి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ  కేంద్రంలో అధికారంలో కి వచ్చిన బిజెపి నరేంద్రమోడీ నాయకత్వం లోని ఎన్డీఎ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లిం మైనార్టీలకు తీవ్రమైన అన్యాయం చేస్తుందని, సంవత్సరాలు కొద్ది ఉన్న వక్ఫ్ బోర్డ్ బిల్లును ఇవాళ లోక్ సభ లో ప్రవేశ పెట్టడం జరుగుతుందని ఎన్ని విమర్శలు,అభ్యంతరాలు ఎన్ని వచ్చినా ఈ బిల్లు ఎలాగైనా ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని, తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేశారు,దేశవ్యాప్తంగా 9.40 లక్షల ఎకరాలు భూములు కలిగిన 3,వ అతిపెద్ద సంస్థ వక్స్ బోర్డ్ ఉన్నదన్నారు. ముస్లిం మైనార్టీల భాష, సాంస్కృతిక, ఆర్థిక, విద్య, ఉపాధి సామాజిక అభివృద్ధి భావితరాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ధార్మిక కార్యక్రమాల కోసం దూర దృష్టితో పూర్వీకులు తమ ఆస్తులను, భూములను వక్ఫ్ చేశారన్నారు. భూములను కాపాడవలసిన వారే అక్రమాలకు,కబ్జాలకు పాల్పడుతున్నారు. బిల్లు సవరణ పేరుతో అన్యమతస్తులను వక్స్ బోర్డులో పెట్టడం వల్ల వక్ఫ్ లక్ష్యాలను విస్మరించడమే అవుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ముస్లింలు అభివృద్ధి పట్ల గాని, వక్ఫ్ ఆస్తుల రక్షణ పట్ల గాని చిత్తశుద్ధి ఉంటే రంగనాథ మిశ్రా సిఫారసులను,సచార్ కమిటీ నివేదికలను తెప్పించుకొని ముస్లింల అభివద్ధికి చేసిన సూచనలు ఎందుకు అమలు చేయడం లేదన్నారు. వక్స్ చట్ట సవరణ ద్వారా ముస్లిం మైనార్టీలకు వక్ఫ్ ఆస్తులపై ఎలాంటి హక్కులు లేకుండా చేస్తుందన్నారు. దర్గాలు, మసీదులు, పీర్ల చావడి తదితర వాటిపై వారసులకు నిర్వహణ కమిటీలకు ఎలాంటి హక్కులు లేకుండా వారి నుండి ఆస్తులను లాగేసుకోవడం కోసం చేస్తున్న చట్టం తప్ప మరొకటి కాదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించునే విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో ఇన్సాఫ్ నాయకులు దాదావలి, కాజా, ఇస్మాయిల్, రఫీక్, నబి సాబ్, టైలర్ కాజా, భాష,ఖాదర్, సమీర్, తదితరులు పాల్గొన్నారు.

About Author