రాబోయే ఎన్నికల్లో బిజెపి, జనసేన, టిడిపి కూటమిని గెలిపించుకుంటాం..
1 min readరాష్ట్ర ఎమ్మార్పీఎస్ పిలుపుమేరకే మా నిర్ణయం
దెందులూరు నియోజకవర్గ ఎంఆర్పిఎస్ నాయకులు
పల్లెవెలుగు వెబ్ ఏలూరుజిల్లా ప్రతినిధి : డ్రదులూరు నియోజక వర్గం లో ఈ సారి జరగబోయే ఎన్నికల్లో ఎం ఆర్ పి ఎస్ నాయకులంతా జనసేన టి డి పి బి జె పి కూటమి ని బలపరచాలని తీర్మానించుకున్నారు.ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దెందులూరు నియోజక వర్గ ఎం ఆర్ పి ఎస్ ప్రతినిధులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పెదవేగి మండల స్థాయి ఎం ఆర్ పి ఎస్ నాయకులు చోడిమెళ్ళ నిరీక్షణ. జొన్న కూటి జాన్.తాదిగడప వెంకటపతి. చాలపాటి నాగరాజు. బొబ్బూరి మిఖాయేలు అధ్యక్షతన ఆదివారం పెడవేగిలో ఎం ఆర్ పి ఎస్ విస్తృత స్థాయి సమా వేశం జరిగింది.ఈ సమావేశం లో నాయకులు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో మాదిగలకు వర్గీకరణ ఫలాలు అందాయన్నారు.హైదరాబాద్ లో ఎం ఆర్ పి ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందా కృష్ణ మాదిగ నిర్వహించిన ఎం ఆర్ పి ఎస్ శంఖా రావ భారీ బహిరంగ సభకు దేశ ప్రధాని నరేంద్రమోడీ ని ఆహ్వానించి మాదిగలు అనాదిగా అభివృద్ధికి దూరంగా ఉన్నారని చెప్పారని నాయకులు గుర్తు చేశారు.ఎస్ సి వర్గీకరణకు పార్ల .మెంట్ లో ప్రత్యేక బిల్లు పెట్టి చట్ట బద్ధత కల్పిస్తామని ప్రధాని ఇచ్చిన హామీ మాదిగ జాతికి మణిహారం అన్నారు.ఆంధ్ర ప్రదేశ్ లో ఈ సారి జరగబోయే ఎన్నికల్లో టి డి పి జనసేన బి జె పి కూటమి అభ్యర్థులకు మద్దతు తెలిపి బారి మెజారిటీతో గెలిపించి వర్గీకరణ ఫలాలు అందుకోవాన్నదే మాదిగల .ముఖ్య ఉద్దేశమని జొన్నకూటి జాన్.చోడిమెళ్ళ ప్రసాద్.కన్నూరి కిషోర్.ఉప్పులూరి ఎలీషా ఈ సమావేశం లో అన్నారు.