PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఊసే లేని వైయస్సార్ చేయూత: భాజాపా మండల అధ్యక్షుడు

1 min read

కె.బి .దామోదర్ నాయుడు

పల్లెవెలుగు  వెబ్ ప్యాపిలీ:  ఊసే లేని వైయస్సార్ చేయూత,నాలుగో విడత చేయూతపై లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని భాజాపా మండల అధ్యక్షుడు కె.బి .దామోదర్ నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈసందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ ప్యాపిలి మండలం డ్వాక్రా గ్రూపుల్లో 45నుంచి 60 ఏళ్ల మధ్య వయసులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం వైయస్సార్ చేయూత పేరుతో 75.000 ఆర్థిక తోరపాటున అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం పర్యటించింది. నాలుగు సంవత్సరాల కాలంలో నాలుగు విడుదలగా ఏటా 18.750 అందిస్తామని తొలుత ప్రకటించారు.2019 జూన్ లో అధికారంలోకి వచ్చిన వెంటనే హడావుడి చేసిన ప్రభుత్వం 2020 ఆగస్టు వరకు ఈ పథకం ఊసే ఎత్తలేదు అధికారం చేపట్టిన 14 నెలల తర్వాత పథకాన్ని ప్రారంభించలేదు దీంతో డ్వాక్రా మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉండడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం 2020 ఆగస్టు 12న పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో దాదాపు రెండు లక్షలపై మందికి ఆర్థిక చేయూతను అందించారు. తొలుత పథకం ప్రారంభించడంలోనే ఆలస్యం చేసిన ప్రభుత్వం ఆ తర్వాత కూడా క్రమంగా వాయిదా వేసుకుంటూ జాప్యం చేస్తూ వస్తుంది.2021జూన్ లో రెండో తప్ప చేయూత నగదు అందించిన ప్రభుత్వం, 2022 సెప్టెంబర్ 23 వరకు మూడో దఫా చేయూత  అందించలేదు 2023 నాలుగో దఫా చేయూత పై అనుమానాలు తలెత్తాయి. ఈ దఫా ఏడాది దాటిపోయిన చేయూత ఇవ్వకుండా ప్రభుత్వం మీనా వేషాలు లెక్కిస్తుందని లబ్ధిదారులు వాపోతున్నారు.

About Author