బిజెపి మంత్రిని పదివి నుంచి తొలగించాలి…!
1 min read
వలగుంద మండల కాంగ్రెస్ మండల కన్వీనర్ డిమాండ్
బిజెపి వైఖరి పై తీర్వస్థాయిలో విరుచుకోపడ్డ కాంగ్రెస్ నేత
కర్నూలు, న్యూస్ నేడు: ఆపరేషన్ సింధూర్ ఎంతో కీలకంగా వ్యవహరించిన మన భారతదేశ ముద్దుబిడ్డ కల్నల్ సోఫియా ఖురేషి నీ ఉద్దేశించి బిజెపి ఎంపీ కున్వర్ విజయ్ షా చేసిన మతపరమైన లైంగిక వివక్ష పూరిత వ్యాఖ్యలు అత్యంత అవమానకరమని కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం వలగుంద మండల కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ ఎం అమనుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం ఆయన నోరు జారిన మాటలు కావని బిజెపి మనస్తత్వంలో పేరుకుపోయిన కుళ్ళుకు ఇది స్పష్టమైన నిదర్శనం అని ఆయన అభిప్రాయపడ్డారు మహిళా ఆర్మీ అధికారిని బీజీపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలు సమాజంలో తీర్వ చర్చ నీ అంశంగా మారిన నేపథ్యంలో బీజీపీ ఎంపీ కున్వర్ విజయ్ షా కల్నల్ సోఫియా ఖురేషిపై చేసిన మతతత్వ లైంగిక అత్యంత బాధాకరమైన విషయమని ఆయన అభిప్రాయపడ్డారు మోదీ అండ్ కో గొప్పగా చెప్పుకొనే భారతదేశం ఇదేనా ఆయన ప్రశ్నించారు. మహిళా అధికారిని ఇంత నీచమైన భాషలో అవమానించడం నవభారతం అని ప్రశ్నించారు ఇది విడిగా జరిగిన సంఘటన కాదని బిజెపి మౌలిక సిద్ధాంతమే మతపరమైన ధ్రువీకరణ పై ఆధారపడి ఉందని ఆయన ఆరోపించారు భిన్నత్వంలో ఏకత్వం ఉన్నా మన భారతదేశంలో బిజెపి కేవలం ఓట్ల కోసం హిందూ ముస్లిం అని వేరు చేసి గెలవడానికి ప్రయత్నం చేస్తుందని అది తప్ప ఇంకొకటి అభివృద్ధి పనులు ఇంతవరకు దేశానికి వెన్నుపోటు లాంటి రైతు రైతులకు గిట్టుబాటు ధర లేక అనేక ఇబ్బందులు పడుతుంటే వారికి పట్టించుకోకుండా కేవలం కులతంత్రం పై పని చేస్తుంది ఈ బిజెపి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా గుణపాఠం చెప్పాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే రైతులకు రుణమాఫీ అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమని అమానుల్లా తెలపడం జరిగింది మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రెండు లక్షలు మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే తగ్గుతుందని గర్వంగా చెప్పడం జరుగుతుంది అదే కాకుండా ప్రతి పేదలకు 6 కేజీ సన్న బియ్యం కూడా ఇవ్వడం ఈ భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో చేయని పని మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించిన ఘనత మన కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని ఈ సభాముఖంగా గర్వంగా చెప్పుతున్నాను అందువలన రాబోయే ఎన్నికల్లో అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ నీ ప్రధాని చేయడం మన అందరి బాధ్యత ఉందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పాల్గొనడం జరిగింది.