NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అమీర్ ఖాన్ పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : దేశంలో జ‌నాభా అస‌మాన‌త‌ల‌కు అమీర్ ఖాన్ లాంటి వారే కార‌ణ‌మ‌ని బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ జ‌నాభా దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని ఆదివారం విలేక‌రుల స‌మావేశంలో సుధీర్ గుప్తా మాట్లాడారు. భార‌త భూభాగం అంగుళం కూడ పెర‌గ‌లేద‌ని, జ‌నాభా మాత్రం 140 కోట్లకు చేరింద‌ని అన్నారు. విభ‌జ‌న స‌మ‌యంలో పాకిస్థాన్ కు ఎక్కువ భూమి వెళ్లింద‌ని, ప్రజ‌లు త‌క్కువ‌గా వెళ్లార‌ని అన్నారు. అందులో కొంద‌రు తిరిగి భార‌త భూభాగానికి తిరిగి వ‌చ్చారు. కానీ అందుకు త‌గ్గట్టుగా భార‌త భూభాగం పెర‌గ‌లేద‌ని అన్నారు. అమీర్ ఖాన్ మొద‌టి భార్యను.. ఆమె సంతానాన్ని, రెండో భార్యను ఆమె సంతానాన్ని వ‌దిలేశాడ‌ని, ఇప్పుడు మూడో భార్య కోసం ఎదురుచూస్తున్నాడ‌ని విమర్శించారు.

About Author