బీజేపీ నందికొట్కూరు సమన్వయకర్త జన్మదిన వేడుకలు
1 min read
పల్లెవెలుగువెబ్, నందికొట్కూరు: బైరెడ్డి శేషశయన రెడ్డి స్పూర్తితో.. వారి ఆశయసాధన కోసం రాజకీయ పార్టీలో చేరి ..బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆశీసులతో నియోజకవర్గ నాయకునిగా ఎదిగిన కొండెపోగు చిన్న సుంకన్న 37వ జన్మదిన వేడుకలను ఆదివారం ఆయన స్వగృహంలో ఘనంగా జరుపుకున్నారు. అభిమానుల కోలాహలం నడుమ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యువత క్రీడల్లో రాణించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో చిన్న నాగన్న, పగడం సోమ శేఖర్,జయరాజు తదితరులు పాల్గొన్నారు.