ముస్లిం పర్సనల్ లా మార్చేందుకు బి జె పి కుట్రలు
1 min readపల్లెవెలుగు, వెబ్ విశాఖపట్నం : జగదాంబ జంక్షన్, మక్కా మసీదు లో శుక్రవారంనమాజు అనంతరంయూనిఫామ్ సివిల్ కోడ్ పై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్) రాష్ట్ర ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అమీన్ భాయ్ మాట్లాడుతూదేశవ్యాప్తంగా ఉమ్మడి పౌర స్మృతిని బిజెపి అమలు చేస్తామని చెప్పటాన్ని మా పార్టీ తీవ్రంగాఖండిస్తుంది,ఒకపక్క భారతదేశంలో నిరుద్యోగం అధిక ధరలు అనేక సమస్యలతో దేశ ప్రజలు బాధపడుతుంటే దేశ ప్రజల దృష్టిని మరల్చిందుకు బిజెపి యూనిఫాం సివిల్ కోడ్ ను తీసుకొచ్చింది, యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల ఆదివాసీలు అల్ప సంఖ్యాక వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతుంది, దేశంలో త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కుతంత్రాలను ఎత్తుగడలను ఆర్ పి ఐ’ పార్టీ అడ్డుకుంటుంది, యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుపై ప్రధాని మోడీ చేసిన ప్రకటన ఇది ఒక రాజకీయ స్టంట్ మాత్రమే దేశంలో మతకలహాలు సృష్టించి మూడోసారి అధికారంలోకి రావాలని బిజెపి ఎత్తుగడలు వేస్తుంది, గత 15 సంవత్సరాలు క్రితం నుంచి అమల్లో ఉన్న ముస్లిం పర్సన్ లాను రద్దుపరిచేందుకు భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది సిక్కు ఫార్సీ క్రిస్టియన్లు ఆదివాసీలు ముస్లింలు ఇతర అల్ప సంఖ్యాక వర్గాలకురాజ్యాంగంలోని ఆర్టికల్ 24 ద్వారా సక్రమించిన హక్కులను కాలరాసేందుకు బిజెపి నేతృలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది యూనిఫాం సివిల్ కోడ్ అమలుకు ఏఐ డీఎంకే, ఏపీపి, టిడిపి, వైసిపి, పార్టీలు బిజెపికి సహకరించటం దుర్మార్గమైన చర్య దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం, కాంగ్రెస్ వామపక్షాలు ఎన్సిపి, బీఎస్పీ, డీఎంకే, తృణమాల్ కాంగ్రెస్, జనతాదళ్ లోక్ దళ్, తదితర 15 రాజకీయ పార్టీలు దేశంలోని కోట్లాదిమంది ప్రజలు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలుకు పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి, దేశవ్యాప్తంగా ప్రజాక్షేత్రంలో యూనిఫాం సివిల్ కోడ్ ని వ్యతిరేకిస్తూ ఆర్ పి ఐ ‘పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తుందని హెచ్చరిస్తున్నాం అన్నారు.