పల్లెపల్లెకు బిజెపి… కార్యక్రమానికి శ్రీకారం
1 min read– బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పురుషోత్తం రెడ్డి
– ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా బిజెపి పార్టీ ముందుకు సాగుతుంది
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: మండల కేంద్రం నందు అక్కమ్మ తోటలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, బిజెపి ఆదోని డివిజన్ ఇంచార్జ్ పురుషోత్తం రెడ్డి హాజరు కావడం జరిగింది. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ మార్చ్ నెల 10 వ తేదీ నుండి మార్చి నెల 25 వ తేదీ వరకు పల్లె పల్లెకు బిజెపి అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అదేవిధంగా కౌతాళం మండలంలోని 33 గ్రామాలలో పర్యటిస్తామని 15 రోజులు పాటు మండలంలోని వివిధ గ్రామాలలో పల్లెనిద్ర చేపడతామని అన్నారు. ఈ యొక్క పల్లె పల్లెకు బిజెపి అనే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమనగా గ్రామాలలో పర్యటించిన తర్వాత గ్రామాలలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రజలను కార్యకర్తలను అడిగి తెలుసుకుంటామని ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే వాటిని పరిష్కరించే దిశగా బిజెపి ముందుకు పోతుందని అన్నారు మరియు వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంత్రాలయం నియోజకవర్గం లో అరాచకాలు దౌర్జన్యాలు గుండాయిజం రౌడీయిజం పెరిగిపోయిందని గ్రామాలలో ఉండే సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, అందుకోసమే పల్లె పల్లె బిజెపి అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు అండగా నిలబడతామని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ మరియు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆదోని డివిజన్ ఇంచార్జ్ పురుషోత్తం రెడ్డి అన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు అక్కమ్మ తోట రామకృష్ణ మరియు మండల అధ్యక్షుడు వెంకన్న, హాల్వి బిజెపి నాయకులు హనుమంత గౌడ్, మైబు,వెంకట్ రెడ్డి,మండల ప్రధాన కార్యదర్శి రామచంద్ర బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.