NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైకాపా ప్రభుత్వం అరాచకాలను బిజెపి చూస్తూ ఊరుకోదు…

1 min read

– రాజ్యసభ  మాజీ సభ్యులు టీజీ వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాష్ట్రప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ ఆధ్వర్యం లో నగరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఛార్జ్ షీట్ కార్యక్రమం లో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్,నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి,రామస్వామి, చంద్రమౌళి,అంబాల ప్రభాకర్ రెడ్డి,నరసింహవర్మ,సందడి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాజ్యసభ  మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను బిజెపి ఇకపై చూస్తూ ఊరుకోదని  హెచ్చరించారు. దేశ సమగ్రతకు సంబంధించిన బిల్లుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బిజెపికి మద్దతు ఇచ్చినందున వైకాపా ప్రభుత్వంపై బిజెపి సానుకూలంగా చూసిందన్నారు.బీజేపీ  వైసీపీ ప్రభుత్వానికి మాత్రమే మద్దతు ఇచ్చిండని,వైసీపీ పార్టీకి కాదన్నారు. ఎన్నికల దృష్ట్యా బిజెపి ప్రభుత్వం వైకాపాను తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. ఉద్యోగాలు లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని  తెలిపారు.సంపదను పంచడం తప్ప పెంచడం లేదన్నారు.కెంద్రము ఇచ్చే నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తు న్నారని తెలిపారు.వేల కోట్ల రూపాయలతో  రంగులు వేయడం తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదని అన్నారు.  రాష్ట్రంలో అన్ని విషయాలు పక్కన పెట్టి కేవలం రాజధాని విషయంపైనే తిరుగుతుందని ప్రతిపక్ష నేతగా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్న జగన్మోహన్ రెడ్డి…. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాజధాని వైజాగ్ కు తరలిస్తే పరిపాలన కష్టతరమవుతుందని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడతారన్నారు.  వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం పతనం తథ్యం అన్నారు.

: అనంతరం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ

జీవో నెంబర్ ఒకటిని కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం వైకాపా పాలనకు చెంపపెట్టని  తెలిపారు. రాష్ట్రంలో ఐపిసి సెక్షన్లను వైసీపీ సెక్షన్లుగా మార్చిన వైకాపా ప్రభుత్వం పై  కోర్టులో వ్యతిరేకంగా  తీర్పు రావడాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రజల అభిప్రాయాలకు వ్యతిరేకంగా చీకటి జీవోలు తీసుకొనివస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఇప్పటికైనా మార్చుకోవాలని ఆయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వం పై ప్రజల కోసం బీజేపీ ఆధ్వర్యం లో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

About Author