ఐదు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీదే విజయం : మోదీ
1 min read
పల్లెవెలుగు వెబ్ : త్వరలో జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. సామన్యులకు, పార్టీకి మధ్య విశ్వాస వారధిగా నిలబడాలని కార్యకర్తలకు, నేతలకు సూచించారు. సేవ, సంకల్పం, నిబ్ధతపైనే బీజేపీ పనిచేస్తుందన్నారు. రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరుగుతోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడ బీజేపీ బలం పుంజుకుంటోందని తెలిపారు. బద్వేలు, హుజురాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ బలంగా పెరిగిందని మోదీ చెప్పినట్టు ఆ పార్టీ వర్గాలు తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం జేపీ నడ్డా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.