అనారోగ్యంతో బీజేపీ కార్యకర్త అనీల్ మృతి
1 min read– అనిల్ కుటుంబానికి ఆర్థిక సహాయం
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామానికి చెందిన బిజెపి కార్యకర్త అనీల్ అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. అనీల్ మృతి చెందిన విషయం తెలుసుకున్న బీజేవైయం రాష్ట్ర కార్యదర్శి డా.బైరెడ్డి శబరి అనీల్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.5 వేలు తక్షణ ఆర్థిక సహాయం అందించారు. మంగళవారం ఉదయం ఆర్థిక సహాయాన్ని బైరెడ్డి శబరమ్మ సైన్యం అధ్యక్షులు కాటం చిన్న నాగన్న ఆధ్వర్యంలో అనీల్ సోదరి సుంకమ్మ కు అందజేశారు.అనీల్ మృతి పార్టీకి తీరని లోటు అని అన్నారు. పార్టీ కార్యక్రమాలలో ఎంతో చురుకుగా పాల్గొనేవారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు బైరెడ్డి శబరి అమ్మ సైన్యం ఉపాధ్యక్షులు రాజు ,బిజెపి మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ కరీం భాషా, డీలర్ రమణ, నాగేష్ ,స్వాములు ,కిసాన్ మోర్చా నాయకులు అబ్రహాము, కృష్ణ తదితరులు పాల్గొని ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు.