సొంత సైన్యం ఏర్పాటుకు బీజేపీ యత్నం : మమత
1 min readపల్లెవెలుగువెబ్ : అగ్నిపథ్ పథకంతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఆరోపించారు. ఈ పథకం సైనిక దళాలను కించపర్చేలా ఉందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, ఇప్పుడు జనాన్ని వెర్రివెంగళప్పలను చేస్తోందని ధ్వజమెత్తారు. కాగా.. గత కొన్ని రోజులుగా అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.