కేంద్రంలో బీజేపీ దుష్ట పాలన సాగుతోంది..
1 min read– దేశానికి పూర్వ వైభవం తీసుకురావడమే కాంగ్రెస్ ద్వేయం..
– పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: కేంద్రంలో కొనసాగుతున్న దుష్టపాలన అంతం కోసమే రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని పీసీసీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలి అన్నారు. శుక్రవారం నందికొట్కూరు పట్టణంలో అశోక గ్యాస్ ఏజెన్సీ ఆవరణలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య నాయకుల సమావేశం అనంతరం నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ నిరంకుశ పాలనలో దేశం అభివృద్ధిని కోల్పోయిందని, దీంతో ప్రజలందరూ ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎదుర్కోవడం కోసమే రాహుల్ గాంధీ భారత్ జూడో పాదయాత్ర చేశారన్నారు . కేంద్రాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలతోపాటు మీడియాను అణిచివేసే బీజేపీ చర్యలను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. దేశానికి పూర్వ వైభవం తీసుకురావడం కాంగ్రెస్‌కే సాధ్యమని అన్నారు.
ఇంటింటికి జూడో అభియాన్ గోడ పత్రిక ఆవిష్కరించారు.
కార్యక్రమంలో నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్, నందికొట్కూరు కాంగ్రెసు పార్టీ ఇంచార్జి అశోక రత్నం, ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షుడు నాగ మధు యాదవ్, నాయకులు బాలస్వామి, జక్కరయ్య, సత్తార్, నంద్యాల కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మోహన్ రావు, డోన్ ఇంచార్జి పుల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.