PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అక్రమాల పుట్ట ప్రభుత్వ భూములను వదలని బి కే సింగ్..

1 min read

–తిరుమలగిరి గ్రీన్ సిటీ పేరుతో పాణ్యం మండలం కౌలూరులో వేసిన వెంచర్ పై విచారణ చేపట్టాలి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామినేని రాజునాయుడు ప్రజా సంఘాల నాయకుడు దేవ దత్తు డిమాండ్

పల్లెవెలుగు వెబ్ పాణ్యం : రెవెన్యూ అధికారులు ఆమ్యామ్యా తలొగ్గి బి.కె.సింగ్ కు వత్తాసు పలుకుతున్న వైనం.బి.కే.సింగ్ గారు పట్టా భూమిని కొనుగోలు చేస్తే ఆ పక్కనే ఏ ప్రభుత్వ భూమి ఉన్నా కలిపేసుకోవడం చాలా వెంచర్లలో జరిగింది వాస్తవం కాదా.నంద్యాల జిల్లా పాణ్యం మండలం కౌలూరు గ్రామంలో తిరుమలగిరి వెంచర్ దగ్గర శనివారం నాడు ఉధ్యమ నాయకులు సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ వామపక్ష పార్టీ ఏ.ఐ.ఎఫ్.బి రాష్ట్ర కార్యదర్శి రామినేని రాజునాయుడు , ప్రజా సంఘాల ప్రతినిధి దేవదత్తు , రాయలసీమ విద్యార్ధి ఫెడరేషన్ ఆర్వీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాయలసీమ రవీంద్రనాధ్ మాట్లాడుతూ తిరుమలగిరి గ్రీన్ సిటీ పేరుతో బి.కె.సింగ్ పాణ్యం మండలం కౌలూరులో భూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. అతను వెంచర్ మొదలు పెట్టాక పూర్వపు దారులు కూడా మాయం చేశారన్నారు. సర్వే నెంబరు 400 జుర్రవాగులో 13 ఎకరాలుకు పైగా ఉండగా వాగు పోరంబోకులో ప్లాట్లుకు గాను అలాగే ఓపెన్ స్పేస్ కి గాను 2 ఎకరాలకు పైగా ఆక్రమించారన్నారు. మిగిలిన భూమిలో కూడా మట్టిని తవ్వకాలు జరిపారన్నారు. అలాగే సర్వే నెంబర్ 423లో ఒక ఎకరం వరకు వాగును తన వెంచర్ లోనికి కలిపేసుకున్నారన్నారు. ఇందుకు రెవెన్యూ వారి సహకారం కూడా ఉందన్నారు. సర్వే నెంబర్ 400లో 13 ఎకరాల భూమి పైగా ఉంటే రెవెన్యూ వారు కేవలం 3 ఎకరాల వరకే ఉన్నట్లు అడంగల్ రికార్డులో చూపించారన్నారు. మిగతా భూమి ఎక్కడ ఉందో తక్షణమే సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. బి.కె.సింగ్ గారు పట్టా భూమి కొనుగోలు చేస్తే ఆ పక్కనే ఏ ప్రభుత్వ భూమి ఉన్నా కలిపేసుకోవడం చాలా వెంచర్లలో జరిగింది అన్నారు. ఆక్రమించిన ప్రభుత్వ భూములకు ఇతర సర్వేనెంబర్లతో రిజిస్ట్రేషన్ చేయిన్నారనీ , పొజిషన్ కు రిజిస్ట్రేషన్ చేసిన సర్వేనెంబర్ లకు సంబంధం ఉండదని అన్నారు. ఇతనిమీద అనేక అరోపనలు కంప్లైంట్ లు ఉన్నప్పటికీ అధికారులు అమ్యమ్యాలకు తలొగ్గి సహకరిస్తున్నారన్నారు. వెంటనే ఈ రెండు సర్వే నెంబర్లలో సర్వే చేసి ఆక్రమణకు గురైన వాగులను స్వాధీనం చేసుకోవాలని అన్నారు. సర్వే నెంబరు 400లో వాగు మట్టిని కూడా అక్రమంగా ప్రొకిలింగ్, ట్రాక్టర్ల ద్వారా ఆయన వేసుకున్న వెంచర్ కు మట్టిని తరలించారు. దాదాపు15 మీటర్ల లోతు జుర్రాగు మట్టిని తీసారు. అంత లోతు మట్టి తీయడం వల్ల ఎస్సీ కాలనీలోకి వర్ష కాలంలో నీరు వచ్చే ప్రమాదం ఉన్నదనీ , జుర్రాగు సమీపంలో దాదాపు మా ఎస్సీ కుటుంబాలు దాదాపు 200 ఇండ్లు ఉన్నాయనీ , గతంలో ఎస్సీ కాలనీలోనికి జుర్రాగు నీరు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు. బి.కె.సింగ్ మీద కౌలూరు గ్రామ ప్రజలు పాణ్యం మండలం తాసిల్దార్ ఆర్డీఓ గారి దృష్టికి తీసుకుపోయినపట్టికీ ఎటువంటి చర్యలు లేవు. తక్షణమే సర్వే. 400,423 సర్వేనెంబర్లను సర్వే చేసి వాగుల హద్దులు ఏర్పాటు చేస్తే ఎంత భూమి ఆక్రమించారో బయటపడుతుంది అన్నారు. బి.కె.సింగ్ వారి అగ్రసేని, తిరుమలగిరి తదితర పేర్లతో వేసిన వెంచర్లన్నింటినీ విజిలెన్స్ ఎంక్వరీ కమిటీ వేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

About Author