(బికెఎంయు)25న జంగారెడ్డిగూడెంలో మహాసభ..
1 min read– కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు తీసుకురావడంలో సంఘం విశేష కృషి..
– మహాసభలో చర్చించి, భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది..
– బండి వెంకటేశ్వరావు జిల్లా ప్రధాన కార్యదర్శి
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ( బి కే ఎం యు) ఏలూరు జిల్లా ప్రధమ మహాసభ జూలై 25 వ తేదీ జంగారెడ్డిగూడెంలో జరుగుతుందని బికేఎంయు జిల్లా ప్రధాన కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బికేఎంయు రెండుగా విడిపోవడం వల్ల ఏలూరు జిల్లా మహాసభ ఈనెల25వ తేదీన జంగారెడ్డిగూడెం ఆలపాటి గంగాభవాని కళ్యాణ మండపంలో జరుగుతుంది. 25వ తేదీ ఉదయం 10 గంటలకు వందలాదిమంది గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికులతో ప్రదర్శన 11 గంటలకు కళ్యాణ మండపంలో మహాసభ జరుగుతుంది. ఈ మహాసభకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనమండలి సభ్యులు జల్లి విల్సన్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు బోడ వజ్రం జిల్లా అధ్యక్షులు మామిళ్ళపల్లి వసంతరావు మరియు వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ జిల్లా నాయకులు పాల్గొంటారని వెంకటేశ్వరరావు తెలిపారు. 1936లో ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన వ్యవసాయ కార్మిక సంఘం గత 87 సంవత్సరాలుగా పేద ప్రజలకు భూమికోసం, భుక్తి కోసం, సాగు భూముల సొంతం కోసం అనేక ఉద్యమాలు ఆందోళనలు పోరాటాలు నిర్వహించి లక్షల మంది పేదలకు ఇండ్ల స్థలాలు, సాగు భూములు సాధించి పెట్టిందని ఆయన తెలిపారు. నూజివీడు నియోజకవర్గంలో గత ఆరు దశాబ్దాలుగా 25 వేల ఎకరాలు అడవి బంజర్లు పేదలకు సాధించడం జరిగిందని, వాటిలో పదివేల ఎకరాలకు పట్టాలు రావాల్సి ఉందని ఆయన అన్నారు. చింతలపూడి, కామవరపుకోట టి.నరసాపురం మండలాలలో అడవి బంజరు పోరాటం చేసి వందలాదిఎకరాలు పేదలకు సాధించి పెట్టిన ఘనత ఏపీ వ్యవసాయ కార్మిక సంఘంనకు ఉందన్నారు. అలాగే వేలాది ఎకరాలలో వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేయడంలో వ్యవసాయ కార్మిక సంఘం పాత్ర ప్రముఖమైంది. గ్రామీణ పేదలు వ్యవసాయ పనులు లేని టైంలో వలసలు పోకుండా ఉపాధి కల్పించడం కోసం 2005లో యూపీఏ-1 ప్రభుత్వం చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకునిరావడంలో వ్యవసాయ కార్మిక సంఘం, సిపిఐ ఎంతో కృషిచేయని ఆయన తెలిపారు. ఏపీలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులు తీసుకునిరావడంలో వ్యవసాయ కార్మిక సంఘం విశేష కృషి చేసింది. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చడానికి ప్రయత్నిస్తుంటే రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోనేరు రంగారావు భూ కమిటీ సిఫార్సులను తుంగలో తొక్కి అమలు చేయడం లేదని బండి వెంకటేశ్వరావు పేర్కొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలో గ్రామీణ ఉపాధి చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయడం కోసం, కోనేరు రంగా రావు భూ కమిటీ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల్లో చేర్చాలని, నూజివీడు నియోజకవర్గంలో పేదల స్వాధీనంలో ఉన్న పదివేల ఎకరాల బంజరు భూములకు పట్టాల కోసం, ఏలేరుపాడు, కుక్కునూరు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలంలో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు గిరిజనేతర పేదలకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వన సంరక్షణ సమితులకు కేటాయించిన భూములను సమితి సభ్యులకు హక్కు పత్రాలు ఇవ్వాలని ఉపాధి హామీ పథకం పనులు జాబ్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించి, రోజుకూలి 600 రూపాయలు ఇవ్వాలని మరియు గ్రామీణ పేదలు వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై మహాసభలో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందని బండి వెంకటేశ్వరరావు తెలిపారు.