NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్ల చట్టాలను రద్దు చేయాల్సిందే..

1 min read

– సీపీఐ జిల్లా కార్యాలయంలో నల్లజెండాలతో నిరసన
పల్లెవెలుగు వెబ్​, కడప : కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను, విద్యుత్‌ చట్ట సవరణలను రద్దు చేయాలని అందరికీ ప్రజా వైద్యం అందించాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు యన్. వెంకట శివ డిమాండ్ చేశారు. బుధవారం దేశవ్యాప్త బ్లాక్‌డే నిరసన లో భాగంగా సిపిఐ కడప జిల్లా కార్యాలయం వద్ద నల్ల జెండాలు, ప్లకార్డులు చేపట్టి నిరసన తెలిపారు. అన్నం పెట్టే రైతన్న వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, మోడీ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకట శివ మాట్లాడుతూ 2020 నవంబర్‌ 26న ప్రారంభమైన రైతు పోరాటం ఇప్పటికి ఆరు నెలలు దాటిందని, అయినా కేంద్రం మొండిగా వ్యవహరించి చట్టాలను ఉపసంహరించుకోవడానికి నిరాకరిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author