బ్లాక్ రాక్ ఆస్తులు ఆవిరయ్యాయి !
1 min readపల్లెవెలుగువెబ్ : 10 లక్షల కోట్ల డాలర్ల ఆస్తులున్న బ్లాక్‌రాక్ లాంటి దిగ్గజం … గడిచిన ఆరు నెలల్లో స్టాక్ మార్కెట్ ఆటుపోట్లను తట్టుకోలేకపోయింది. ఈ సంస్థ ఏకంగా తన నిర్వహణ ఆస్తుల్లో రూ.136 లక్షల కోట్లు కోల్పోయింది. అది కూడా ఆరు నెలల కాలంలో. ఇది ఓ ప్రపంచ రికార్డు కూడా. గతంలో ఎన్నడూ ఓ సంస్థ ఆరు నెలల కాలంలో ఇంతలా నిర్వహణ ఆస్తులను కోల్పోలేదు. నిజానికి 2022 తొలి ఆరు నెలలు ప్రపంచ క్యాపిటల్ మార్కెట్లకు ఏమాత్రం కలసి రాలేదనే చెప్పుకోవాలి. ఈ ప్రతికూలతలను ఇతర అస్సెట్ మేనేజ్‌మెంట్ సంస్థలు సాధ్యమైన మేర అధిగమించే ప్రయత్నాలు చేశాయి. కానీ, బ్లాక్‌రాక్‌పై మార్కెట్ పరిణామాల ప్రభావం ఎక్కువగా పడింది. ఎందుకంటే ఈ సంస్థ నిర్వహణ ఆస్తుల్లో మూడొంతులు ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ ఫండ్స్‌లోనే ఉన్నాయి. పెట్టుబడుల పరంగా మారిన ఇన్వెస్టర్ల ప్రాథాన్యతలు సైతం ఈ సంస్థ ఆస్తులపై ప్రభావం చూపించాయి. ఈ సంస్థ నిర్వహించే యాక్టివ్‌లీ మేనేజ్డ్ ఫండ్స్‌లో పావు శాతమే బెంచ్‌మార్క్ కంటే మెరుగైన పనితీరు చూపించాయి.