NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

రెవెన్యూ అధికారుల పై దూషణ.. వైసీపీ నేత పై వేటు !

1 min read

పల్లెవెలుగువెబ్ : రెవెన్యూ అధికారులపై అసభ్య పదజాలంతో దూషించిన వైసీపీ నేత పై వేటు పడింది. అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండల సర్వేయర్‌తో పాటు రెవెన్యూ అధికారులను వైసీపీ మండల కన్వీనర్ ఇందకూరు నారాయణరెడ్డి బూతులు తిడుతూ రెచ్చిపోయారు. దీనిపై వైసీపీ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి స్పందించారు. ఇందుకూరు నారాయణరెడ్డిని ముదిగుబ్బ మండల కన్వీనర్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరుతో ప్రకటన విడుదలైంది. ఇందుకూరు నారాయణరెడ్డి సర్వేయర్‌తో మాట్లాడిన ఫోన్ సంభాషణ తీరు అభ్యంతరకరమంటూ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

   

About Author