NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ద‌ర్భంగ‌లో బ్లాస్టింగ్ ప్లాన్.. లింక్ హైద‌రాబాద్ లోనే !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : బిహార్ లోని ద‌ర్భంగ పోలీస్ స్టేష‌న్ లో పేలుడుకు సంబంధించిన కేసులో ఎన్ఐఏ హైద‌రాబాద్ లో సోదాలు జ‌రిపింది. కీల‌క నిందితుల‌యిన ల‌ష్కర్-ఎ-తోయిబా ఉగ్రవాదులు మ‌హ‌మ్మద్ నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్ సోద‌రుల ఇంట్లో త‌నిఖీలు నిర్వహించింది. పేలుడు ప‌దార్థాలు తయారుచేసే డిజిట‌ల్ డాక్యుమెంట్లు, ఐఈడీల త‌యారీకి ఉప‌యోగించే ముడి ప‌దార్థాలు ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. ఈ కేసు ద‌ర్యాప్తు బంజారాహిల్స్ కు చేరుకుంది. కేసు ద‌ర్యాప్తు అనూహ్యంగా ఆసిఫ్ న‌గ‌ర్, హ‌బీబ్ న‌గ‌ర్, మ‌ల్లేప‌ల్లి నుంచి బంజారాహిల్స్ కు చేరుకుంది. ఫోన్ కాల్ డేటా అనాల‌సిస్ ప్రకారం నేపాల్ కు చెందిన ఇద్దరు ఉగ్రవాదుల‌తో వీరికి సంబంధం ఉన్నట్టు ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.

About Author