NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఆశీర్వదించండి…!

1 min read

–టీడీపీ సీనియర్​ నాయకులు హేమాద్రి రెడ్డి, కే.ఈ.రాంబాబును మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్​ సెక్రటరి కిరణ్మయి

  • క్రీడావిజేతలకు బహుమతులు అందజేత

కోడుమూరు , పల్లెవెలుగు: కోడుమూరు నియోజకవర్గం గూడురు మండలం చనుగొండ్ల గ్రామంలో నూతన సంవత్సరం సందర్భంగా నిర్వహించిన క్రీడాపోటీల విజేతలకు టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్​ సెక్రటరి కిరణ్మయి మంగళవారం బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు తమ వంతు సహాయ సహకారం అందజేస్తామన్నారు. కోడూమూరు నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందని, టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్​. అంబేద్కర్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత వృద్ధులకు చీరలు పంపిణీచేశారు.

టీడీపీ సీనియర్లను కలిసిన కిరణ్మయి

టీడీపీ కోడుమూరు సీనియర్​ నాయకులు హేమాద్రి రెడ్డి, కే.ఈ.రాంబాబును టీడీపీ ఎస్సీ సెల్​ ఆర్గనైజింగ్​ సెక్రటరి నేషపోగు కిరణ్మయి దంపతులు మంగళవారం  మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే కోడుమూరు నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తానని, తనన ఆశీర్వదించాలని హేమాద్రి రెడ్డి, రాంబాబును కోరారు. పేదలకు సేవ చేయాలన్న సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని, ఒక్కసారి అవకాశం ఇస్తే… కోడుమూరు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో జయకృష్ణ, పూర్ణ చంద్ర రావు,  లేపాక్షి, గౌరి, ఎన్​.తులసీ,  టీచర్​ వేమన్న, మాజీ ఎంపీటీసీ సుంకులమ్మ, వార్డు మెంబర్లు ,తదితరులు పాల్గొన్నారు.

About Author