NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జగన్​ను మరోసారి ఆశీర్వదించండి

1 min read

కనకదుర్గ అమ్మవారికి పూజలు చేసి ఆశీస్సులు అందుకున్న సాయినాథ్ శర్మ

పల్లెవెలుగు: కమలాపురం నియోజక వర్గ ప్రజా సేవకుడు వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కాశీ భట్ల సత్య సాయినాథ్ శర్మ శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో విజయవాడ కనక దుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. శనివారం విజయవాడ కి విచ్చేసిన సాయినాథ్ శర్మ రాబోయే ఎన్నికల్లో కనకదుర్గ అమ్మవారి అనుగ్రహంతో రాష్ట్ర ముఖ్యమంత్రిగ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి పీఠం అధిరోహించాలని కడప పార్లమెంట్ అభ్యర్థి అవినాష్ రెడ్డి కమలాపురం శాసనసభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి లకు అఖండ విజయం చేకూర్చాలని కనక దుర్గా అమ్మవారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన  సాయినాథ్ శర్మకు  వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.

About Author