మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా జగనన్న ను ఆశీర్వాదించండి
1 min readఇప్పుడు చరిత్ర అంటే..
జగన్ పాలనకు ముందు జగన్ పాలనకు తర్వాత మాత్రమే..
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ మరోసారి ముఖ్యమంత్రి గా జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని వైసీపీ పార్టీ మండల కన్వీనర్ రవియాదవ్ ప్రజలను కోరారు. ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మండలం లోని బ్రాహ్మణకొట్కూరు గ్రామంలో సచివాలయం 2 పరిధిలో బుధవారం నిర్వహించారు. సచివాలయాల పరిధిలో జగనన్న ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకూ అందించిన డీబీటీ, నాన్ డీబీటీ పథకాల లబ్ధిని తెలియజేస్తూ ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డులను ప్రారంభించారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందుకు కావాలంటే..’ బుక్ లెట్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల కన్వీనర్ రవియాదవ్ మాట్లాడుతూ జగనన్న మనకి మళ్ళీ ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని మొదలు పెట్టడం చాలా ఆనందంగా ఉందన్నారు. గతంలో మనం చరిత్ర గురించి మాట్లాడుకున్నప్పుడు క్రీస్తు పూర్వం, క్రీస్తు శం అని మాట్లాడ్డం జరిగేదని అంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని చెప్పేవాళ్లమన్నారు. కానీ జగనన్న పాలన చూసిన తర్వాత వై.ఎస్. జగన్ పాలనకు ముందు, వై.ఎస్. జగన్ పాలనకి తరువాత అని మాట్లాడుకునే విధంగా మన జగనన్న పాలన ఉందన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఈ రోజున మన కుటుంబంలో ఒక ఇంటి పెద్దగా, ఒక కొడుకుగా, ఒక మనవడిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, పిల్లలకు ఒక మేనమామగా ఈ రోజున మన అందరి కుటుంబాలలో కూడా ఇమిడిపోయారని తెలిపారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా ప్రజల్ని ఓన్ చేసుకున్నది లేదన్నారు. ప్రజలందరి అవసరాలు కూడా తెలుసుకుని వివిధ సంక్షేమ పథకాల రూపంలో వారికి అందిస్తున్నారన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా తీరుస్తున్నారన్నారు. అందుకే ఇలాంటి పాలన ప్రజలు మళ్లీ పొందాలంటే కచ్చితంగా ఈ రాష్ట్రానికి జగనన్న మళ్లీ ముఖ్యమంత్రి కావాలని స్పష్టం చేశారు. అందుకే ఈ విషయాన్ని ‘ఆంధ్రప్రదేశ్ కి జగనే ఎందకు కావాలంటే..’ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. వాలంటీర్స్, గృహ సారథలు, నాయకులు, కార్యకర్తలు అందరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మళ్లీ మరోసారి ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని ఆశీర్వాదించాలని ఆయన ఆకాంక్షించారు. ఎంపీపీ మురళీ కృష్ణా రెడ్డి, జడ్పీటిసి కలిమున్నీసా, వైసీపీ పార్టీ జేసీఎస్ కన్వీనర్ ఓంకార్ రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు పబ్బతి రవి కుమార్ ,మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ రాహాత్ జబ్బార్ ,బ్రాహ్మణ కొట్కూరు సింగిల్ విండో చైర్మన్ మద్దూరు సతీష్ రెడ్డి ,నందికొట్కూరు సింగిల్ విండో చైర్మన్ లక్ష్మి కాంతరెడ్డి , బ్రాహ్మణకొట్కూరు వైసీపీ నాయకులు,శివ రెడ్డి, అశోక్ రెడ్డి, బైరెడ్డి శ్రీధర్ రెడ్డి, సుబ్బన,నందికొట్కూరు మండల వైసీపీ ఎంపీటీసీలు,సర్పంచ్ లు ఉప సర్పంచ్ లు, మండల స్థాయి అధికారులు, మండల కమిటీ సభ్యులు, గృహ సారథులు, వాలంటీర్స్,గ్రామ ప్రజలు, వైసీపీ కార్యకర్తలు , బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.