ప్రభువైన ఏసుక్రీస్తును నమ్మిన వారు ధన్యులు అవుతారు…మాజీ ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: ప్రభువైన యేసు క్రీస్తు జన్మించిన క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని నగరంలోని వివిధ చర్చిలలో జరిగిన సామూహిక ప్రార్థనలకు మాజీ ఎమ్మెల్యే శ్రీ ఎస్ వి మోహన్ రెడ్డి హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభువైన ఏసుక్రీస్తు నమ్మిన వారు ధన్యులు అవుతారని, ప్రపంచంలో బాధతప్త హృదయాలకు స్వాంతన చేకూర్చడం కొరకు ఈ లోకమునకు వచ్చే నని తెలియచేసారు. ఈ సందర్భంగా ఆయన బైబిల్ లోని సూక్తులను గుర్తు చేశారు. చర్చిలలో సామూహిక ప్రార్థన లకు వచ్చిన క్రిస్టియన్ సోదరులకు సోదరీమణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ముందుగా CSi చర్చి, హోసన్నా మందిర్, కోల్స్ పెద్ద చర్చి, స్టాంటన్ చర్చి, గిప్సన్ చర్చి, బుధవార్ల పేట చర్చి ల లో పాల్గొన్నారు అయన వెంట కటారి సురేష్, సత్యరాజ్,, mv రమణ, సుందరాజ్ పరుశరామ్, యేసు, రాజశేఖర్ చిన్న. అంజి. నాగరాజు.అశోక్త. దాసు.దితరులు పాల్గొన్నారు.