NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అందరి ఆశీస్సులతో  అభివృద్ధి కి  పాటు పడుతా

1 min read

నందికొట్కూరు నియోజకవర్గ  మండలాల్లో సర్వమత ప్రార్థనలు చేసిన గట్టు తిలక్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల:  నంద్యాల జిల్లాలోని నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని మండలాలు వెళ్లి ప్రతి మండలం లోని ఆలయాలు, మసీద్ లు, చర్చి లలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కర్నూలు ఐ.టీడీపీ జిల్లా అధ్యక్షుడు ” గట్టు తిలక్ ” మొట్ట మొదటి సారిగా నందికొట్కూరు నియోజకవర్గంలోకి అడుగుపెట్టానాని కాబట్టి ఆ భగవంతుడి దీవెనలు, నందికొట్కూరు నాయకులు మాండ్ర శివానంద రెడ్డి గారు, గౌరు వెంకట రెడ్డి గార్ల ఆశీర్వాదాలతో నందికొట్కూరు నియోజకవర్గం యొక్క అసెంబ్లీ స్థానానికై తానూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫునుండి టికెట్ ఆశిస్తున్నాని తెలియచేశారు. రాష్ర్టంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనను ప్రజలందరూ కలిసి రానున్న ఎన్నికల్లో సంసిద్దమయ్యి జగన్ ప్రభుత్వాన్ని దించేరోజులు దెగ్గరిలోనే ఉన్నాయి అని వచ్చేది తెలుగుదేశం ప్రబుత్వామేనని అయన తెలియచేసారు నందికొట్కూరు   తెలుగుదేశం పార్టీ  తరపున అభ్యర్థి గా తనకు ఒక్క అవకాశం ఇస్తే పార్టీ జెండా ఎగరవేసి నిరుద్యోగ యువతకు, ప్రజలకు సేవ చేస్తూ నందికొట్కూరు యొక్క అభివృద్ధికై పాటుపడతానని ధీమా వ్యక్తం చేశారు.

About Author