NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మేరీమాత ఆశీస్సులు రైతులకు ఎల్లవేళలా ఉండాలి..

1 min read

– రెవరెండ్ బిషప్ బిషప్ జయరావు పొలిమేర
పల్లెవెలుగు వెబ్ చింతలపూడి : ఏలూరు జిల్లా చింతలపూడి మండలం అల్లిపల్లి గ్రామంలో మేరీ మాత ఉత్సవాలు రెవరెండ్ ఫాదర్ మరియ జోజి రాయ్ ఎంఎఫ్, ప్రోవెన్షియల్ సుపీరియర్ మరియు మిషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మూడు రోజులు పాటు జరిగి నేటితో ముగిసాయి. ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా ఏలూరు కతోలిక పిఠాధిపతి బిషప్ జయరావు పొలిమేర హాజరయ్యారు. ఈ సందర్భంగా బిషప్ పొలిమేర. జయరావు మాట్లాడుతూ మేరీ మాత ఆశీస్సులు ఇక్కడికి వచ్చిన భక్తులకు, సుభిక్షమైన పంటలతో ఈ మెట్ట ప్రాంత ప్రజలు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో జీవించాలని ఆశీర్వదించారు. జనవరి 31వ తేదీ నుండి ఫిబ్రవరి రెండో తేదీ వరకు ప్రతి సంవత్సరం అల్లిపల్లి మేరీమాత ఉత్సవాలు నిర్వహించబడతాయని తెలిపారు, ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా చింతలపూడి మార్కెట్ యార్డ్ చైర్మన్ జగ్గవరపు జానకి రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటర్ రెవరెండ్ ఫాదర్ పుష్పారావు వర ఎం ఎఫ్, రెవరెండ్ ఫాదర్ ఉదయ్ కుమార్ గరికముక్కుల ఎం.ఎఫ్ విచారణ గురువులు, ఏలూరు కతోలిక పీఠానికి చెందిన గురువులు, కన్యా స్త్రీలు, ఉపాధ్యాయ ఉపదేశులు, కతోలిక విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author