శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆశీస్సులు కలగాలి
1 min readసంక్రాంతి పండుగ నుంచి ప్రజల కష్టాలు తొలగాలి.
1300 మందికి చీరెలు పంపిణీ.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల : రాష్ట్రంలోని ప్రజలందరికీ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆశీస్సులు కలగాలని నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి మదు కోరారు.నూనె పల్లె లోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం లో అభిరుచి మదు పూజలు నిర్వహించారు.ఆర్యవైశ్య సంఘం అధ్వర్యంలో ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలు జక్కా రాజేశ్వరి,శ్రీ వాసవి మహిళా సంఘం అధ్యక్షురాలు శ్రీ లక్ష్మి,కాల్వ పద్మ, బీజేపీ పట్టణ అధ్యక్షులు కసెట్టీ చంద్రశేఖర్ అధ్వర్యంలో నంద్యాల బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ అభిరుచి చేతులమీదుగా 1300 వందల మందికి చీరెలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు కలగాలని కోరుకున్నారు.సంక్రాంతి పండుగ నుంచి ప్రజల కష్టాలు తొలగాలనీ కోరుకున్నారు.ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మరితో ప్రజల జీవితాలు అతలాకుతలం అయ్యాయని పేర్కొన్నారు.రైతులు,వ్యాపారులు,కష్టజీవులు అందరూ ఆర్థిక సమస్యలు లేకుండా,సకాలంలో వర్షాలు పడి పంటలు పండి రైతులు ఆనందంగా ఉంటే అన్ని వర్గాలు సంతోషంగా వుంటారని అన్నారు. ప్రతి ఒక్కరూ సంపాదించిన డబ్బు ను కొంత పేదలకు సేవ చేయాలని సూచించారు.సంక్రాంతి పండుగ రోజు మహిళలు సంతోషంగా ఉండాలని చేతనైన చిరు సహాయం చేస్తున్నానని అన్నారు.ఉన్నతంగా ఎదగాలి అంటే మహిళ పాత్ర కీలకం అన్నారు.ఈ కార్యక్రమంలో స్వాతి,గంగాధర్,కృష్ణారెడ్డి,రామసుబ్బారెడ్డి , బీజేపీ నాయకులు ,కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.